ఇటీవల కాస్త నష్టాలతో ఇబ్బంది పడిన హెరిటేజ్ మళ్ళీ లాభాల పట్టింది. నారా భువనేశ్వరి సారధ్యంలోని హెరిటేజ్, భారీ లాభాలను అర్జించినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. స్టాక్ మార్కెట్‌లో షేర్ వాల్యూ పెరగడంతో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్లు ఒకే రోజులో 7% పైగా పెరిగాయి. దీనితో రూ. 79 కోట్లు సంపద పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభాలు తగ్గాయని హెరిటేజ్ ప్రకటించింది. కానీ అనూహ్యంగా షేర్ వాల్యూ పెరగడంతో భారీ లాభాలు అర్జించింది.
Also Read : అమ్మో గాయాలు.. భారత్ కు షాక్ ల మీద షాక్ లు
ప్రముఖ డైరీ సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్, ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి క్వార్టర్ లో రూ.40.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.58.4 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 30.7% తగ్గుదలగా కంపెనీ పేర్కొంది. లాభాలు తగ్గినప్పటికీ, కంపెనీ స్టాక్ రూ.493.25కి చేరుకోవడంతో పెట్టుబడిదారులకు లాభం చేకూర్చింది. దీనితో నారా భువనేశ్వరి ఎక్కువగా లాభపడ్డారు. సంస్థలో ఆమె వాటాలు ఎక్కువగా ఉండటంతో పెద్ద ఎత్తున సంపద పెరిగింది.
Also Read : మిథున్ రెడ్డినే అరెస్ట్ అంటే.. మరి మా సంగతి..? వైసీపీలో భయం భయం
హెరిటేజ్ ఫుడ్స్ లో ఆమెకు 2.26 కోట్ల షేర్లు ఉన్నాయి. అంటే కంపెనీలో దాదాపు 24.37% శాతం వాటాలు ఆమెకు ఉన్నాయి. ఒక్క రోజులో షేర్ వాల్యూ భారీగా పెరగడంతో రూ. 79 కోట్లు భువనేశ్వరి సంపద పెరిగింది. చంద్రబాబు కుటుంబానికి హెరిటేజ్ ఫుడ్స్‌లో 35.71% వాటా ఉంది. రాజకీయ పరంగా సంస్థ కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం భారీ లాభాలు తెచ్చిపెట్టింది. డైరీ ఉత్పత్తులలో భారీ ఆఫర్లు కూడా కంపెనీకి కలిసి వచ్చాయి.