Wednesday, February 4, 2026 05:22 PM
Wednesday, February 4, 2026 05:22 PM

నా బరువుతో నీకేం పని.. నటి సీరియస్..!

సినిమా వాళ్లు అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు అలుసు అయిపోయినట్లుంది. అందుకే నోటికి ఏం వస్తే.. అది అడిగేస్తున్నారు. ఇది భాషతో సంబంధం లేదు. నిన్నటి వరకు తెలుగు వారు నోరు పారేసుకుంటే.. వీళ్లకు తమిళ మీడియా కూడా తోడైంది. జర్నలిజం అంటే.. కొన్ని విలువలు పాటించాల్సిందే.. కానీ సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ ఫామ్ పుణ్యమా అని.. కనీస అర్హత కూడా లేని వాళ్లు ప్రెస్, మీడియా అంటూ వచ్చి.. నోటికి ఏం వస్తే అది అడిగేస్తున్నారు. ఎక్కడికైనా వస్తాం.. ఏం చేస్తారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఓ మహిళ పట్ల మీడియా ప్రతినిధి వ్యవహరించిన తీరు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.

Also Read : ప్రచారానికి ఆ ముగ్గురు దూరం.. కారణాలేమిటో..?

నటి గౌరీ కిషన్.. ఈ పేరు చాలా మందికి తెలియదు.. కానీ హీరోగా నటించిన జాను సినిమాలో చిన్నప్పటి సమంత అంటే మాత్రం.. అందరికి ఠక్కున గుర్తుకు వస్తుంది. తమిళంలో వచ్చిన ’96 చిత్రానికి రీమేక్ జాను. 96 సినిమాలో చాలా మంది నటీనటులను అలాగే తెలుగులో తీసుకున్నారు. 96లో కూడా చిన్ననాటి త్రిష క్యారెక్టర్‌ను గౌరీ కిషన్ పోషించారు. ముద్దుగా, బొద్దుగా ఉండే గౌరీ కిషన్ నటన కూడా ఆ సినిమా సూపర్ హిట్‌కు ఓ కారణం. తమిళంలో గౌరీ కిషన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా అదర్స్ అనే సినిమాలో గౌరీ కిషన్ నటించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో ఓ రిపోర్టర్ వేసిన ప్రశ్నకు గౌరీ కిషన్ ఘాటుగా బదులిచ్చారు.

మీ బరువు ఎంత ఉంటుంది..? అంటూ రిపోర్టర్ వేసిన ప్రశ్నకు ముందు కూల్‌గానే జవాబిచ్చించారు గౌరీ కిషన్. అయితే తన ప్రశ్నకు ఆ రిపోర్టర్ సమర్థించుకోవడంతో గౌరీ కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నా బరువు తెలుసుకుని ఏం చేస్తారు మీరు.. అని ఎదురు ప్రశ్నించారు గౌరీ కిషన్. మీ పేపర్‌లో హెడ్ లైన్ వార్త వేస్తారా అని జవాబిచ్చారు. దీంతో హెడ్ లైన్ అంటే ఏమిటో తెలుసా మీకు.. అని రిపోర్టర్ మళ్లీ ప్రశ్నించడంతో.. నేను ఏం చదివానో మీకు తెలుసా.. అసలు నీకు జర్నలిజం గురించి తెలుసా.. అని ఫైర్ అయ్యారు గౌరీ కిషన్. తాను ట్రిపుల్ మేజర్ జర్నలిజం, సైకాలజీ, ఇంగ్లీష్ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశానన్నారు. బాడీ షేమింగ్ అంటే ఏమీటో తెలుసా అని ప్రశ్నించారు.

Also Read : టి20 ప్రపంచ కప్ డేట్స్ ఇవే.. పాక్ మ్యాచ్ లు అక్కడే..!

నా బరువు వల్ల సినిమాకు ఏమైనా నష్టమా.. అని నిలదీశారు. నిర్మాత, దర్శకులకు లేని ఇబ్బందులు మీకు ఎందుకు అని ప్రశ్నించారు. ఇవే ప్రశ్నలు హీరోలను కూడా అడుగుతారా అని ఘాటుగా బదులిచ్చారు. ఇలాంటి ప్రశ్నలు అడిగి మీ వృత్తిని అవమానపరచకండి.. అని జవాబిచ్చారు. ఇదే సమయంలో కార్యక్రమంలో తాను మాత్రమే మహిళ ఉండటంతో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా.. అని అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్న వేసినప్పుడు పక్కనే ఉన్న నటుడు ఆదిత్య మాధవన్ సైలెంట్‌గా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ప్రశ్నలను ఎలా ప్రోత్సహిస్తారని సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. మహిళల బాడీ షేమింగ్ గురించి ప్రశ్నలు వేసే వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

పోల్స్