Saturday, March 14, 2026 11:46 PM
Saturday, March 14, 2026 11:46 PM

వాళ్ల కంటే.. గూగుల్ చాలా బెటర్..!

“మేము చేసింది చెప్పుకోలేక పోయాము.. చేసింది ఎక్కువ.. కానీ చెప్పుకోలేక పోవడం వల్లే ప్రజలకు మా పనులు తెలియలేదు..” ఇదే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. 2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే.. సాయంత్రం 4 గంటలకు మీడియా ముందుకు వచ్చిన జగన్.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించటానికంటే ముందే మేము చేసింది సరిగ్గా చెప్పలేకపోయామంటూ బేల పలుగులు పలికారు. అదే సమయంలో తాము చేయని పనులను కూడా చేసినట్లు టీడీపీ నేతలు అబద్ధపు ప్రచారం చేశారని.. ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శలు చేశారు. తమ పాలన అద్భుతమని గొప్పగా చెప్పారు జగన్. కానీ వైసీపీ పాలన ఎలా సాగిందో.. గూగుల్‌ను అడిగితే సరిపోతుందనే చిన్న విషయం కూడా జగన్ మర్చిపోయినట్లున్నారు.

Also Read : జంతు కొవ్వుపై సుప్రీం కీలక కామెంట్స్

రెండు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చారు జగన్. తన చేతిలో ముందే రాసుకున్న.. ఇంకా చెప్పాలంటే.. ఎవరో రాసిచ్చిన పేపర్లు పట్టుకుని వచ్చేశారు. అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వైసీపీ తరఫున 11వ తేదీ 11 గంటలకు మీడియా ముందుకు వచ్చారు జగన్. ఇక వచ్చినప్పటి నుంచి చెప్పిందే చెప్పారు. 2019-24 మధ్య కాలంలో తమ ఐదేళ్ల పాలన అద్భుతమని.. ఇంకా చెప్పాలంటే.. ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని.. కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా ప్రజలకు అన్ని సౌకర్యాలు ఇచ్చామన్నారు. అసలు అప్పు అంటే ఏంటో తమకు తెలియదన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఒక్క రూపాయి కూడా దుబారా చేయలేదని.. ప్రతి రూపాయి కూడా ప్రజల సంక్షేమానికే ఖర్చు చేసినట్లు కాకి లెక్కలన్నీ చెప్పుకొచ్చారు జగన్.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పిన కాకి లెక్కలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇవ్వలేకపోయినప్పటికీ.. గూగుల్ మాత్రం గట్టిగానే జవాబిస్తుంది. వైసీపీ హయాంలో దుబారా జరగలేదా అనే ప్రశ్నకు గూగుల్ చెబుతున్న సమాధానానికి అందరికి దిమ్మ తిరుగుతోంది. జగన్ చేసింది ఎక్కువ.. చెప్పుకున్నది తక్కువ.. అంటున్నారు నిజమేనా గూగుల్ అని అడిగిన ప్రశ్నకు.. గూగుల్ కూడా ఆశ్చర్యపోయింది. జగన్ ఏం చేశారో తెలుసా.. అంటూ ఎదురు ప్రశ్నించింది. సీఎం అయిన వెంటనే ప్రజా వేదికను కూల్చేశారు.. అది చెప్పుకోలేదు అని గూగుల్ మొదలుపెట్టింది. ఆ తర్వాత నుంచి జగన్ అరాచకాలను గూగుల్ ఏకరువు పెట్టింది.

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల కోసం ఏకంగా రూ.2,600 కోట్లు ఖర్చు చేసిన విషయం గూగుల్ గుర్తు చేసింది. మూడు రాజధానుల వల్ల ఏపీకి జరిగిన నష్టం వైసీపీ నేతలు చెప్పుకోలేక పోయారు. జే బ్రాండ్ మద్యం వల్ల 30 వేల మంది మృతి నిజమే అని వైసీపీ నేతలు ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోలేకపోయారు. తాడేపల్లి ప్యాలెస్‌కు ఐరన్ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారో జనానికి చెప్పుకోలేకపోయారు. ప్యాలెస్‌లో ఎలుకల కోసం, పఫ్‌ల కోసం కూడా కోట్లు ఖర్చు పెట్టిన విషయాన్ని ప్రజలకు చెప్పుకోలేదు. అసలు ఐదేళ్ల పాటు పరదాలు కట్టుకుని ఎందుకు పర్యటన చేశారనే విషయం ఎన్నికలప్పుడే కాదు.. ఇప్పటికీ వైసీపీ నేతలు జనానికి చెప్పలేక పోతున్నారు. హిందూత్వానికి తామే అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్లు అని ఇప్పుడు చెబుతున్న వైసీపీ నేతలు.. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వెనుక గుడి సెట్ ఎందుకు వేశారనే విషయం ఇప్పటికీ చెప్పలేక పోతున్నారు.

Also Read : ఎన్టీఆర్ ను అభిమానించే ఐపిఎస్ దొర ఇక లేరు..!

నిజానికి జగన్ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి మేము చేసింది చెప్పుకోలేకపోయాము.. చాలా చేశాం.. కానీ చెప్పుకోలేదు.. అని అంటున్నారు. ఇలా మరోసారి చెప్పకుండా.. టీడీపీ నేతలే గట్టిగా కౌంటర్ ఇవ్వాలి. వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచకాలు ఇవే.. వీటి గురించి చెప్పండి.. అని టీడీపీ నేతలు రుజువులతో సహా నిలదీయాలి. చంద్రయ్య హత్య, అమర్నాథ్ గౌడ్ హత్య, సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి, టీడీపీ నేతల అక్రమ అరెస్టులు, అమరావతి రైతులపై దాడి.. అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననం.. ఇలా ఎన్నో అంశాలున్నాయి. వీటిని రుజువులతో సహా ప్రశ్నించాల్సిన టీడీపీ నేతలు మాత్రం సైలెంట్‌గా ఉంటుంటే.. గూగుల్ మాత్రం గట్టిగానే వైసీపీ నేతలు జవాబు చెబుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బిజెపికి షాక్ ఇచ్చిన...

ప్రాంతీయంగా కొత్తగా పుట్టిన పార్టీలు అయినా,...

మీకోసమే ఇదంతా.. గిరిజనులతో...

ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజన...

రాజకీయాల్లోకి ప్రీతి రెడ్డి.....

రాజకీయాల్లోకి మరో వారసురాలు రెడీ అయ్యారు....

ఎన్టీఆర్ ను అభిమానించే...

హెచ్ జే దొర.. ఈ తరానికి...

రాజకీయాల్లోకి అలేఖ్య రెడ్డి..!

అలేఖ్య రెడ్డి.. ఈ పేరు పెద్దగా...

రేవంత్‌ ధీమా.. మరి...

మీ పెట్టుబడులు సురక్షితం.. మీ పెట్టుబడికి...

పోల్స్