Monday, October 27, 2025 09:24 PM
Monday, October 27, 2025 09:24 PM
roots

చంద్రబాబు “మైక్రోసాఫ్ట్” స్ట్రాటజీ వర్కౌట్ అయిందా..?

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల విషయంలో చంద్రబాబు సర్కారు అనుకున్నది సాధిస్తుందా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. 2024 లో ఏపీలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల విషయంలో ఇబ్బందులు పడింది. గత ఐదేళ్లపాటు జరిగిన విధ్వంసం తర్వాత చాలామంది పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాలేదు. చంద్రబాబు పై నమ్మకం ఉన్న సరే మళ్లీ జగన్ వస్తే తమకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అనే భావనలో చాలామంది వెనకడుగు వేశారు. చంద్రబాబు విదేశాల నుంచి పెట్టుబడి తీసుకొచ్చేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసినా పెద్దగా సక్సెస్ అవ్వలేదని చెప్పాలి.

Also Read : రేవంత్ ను ముంచేస్తున్న ఎమ్మెల్యేలు

అయితే ఇప్పుడు మాత్రం కంపెనీలు పెద్ద ఎత్తున ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు బిల్ గేట్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఒప్పందం కూడా జరిగింది. ఆ తర్వాత నుంచి ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు పలు కీలక సంస్థలు ఆసక్తి చూపించడం మొదలుపెట్టేసాయి. మైక్రోసాఫ్ట్ వస్తే చిన్న కంపెనీలు పెద్ద కంపెనీలు క్యూ కడతాయని చంద్రబాబు భావించారు. అందుకే తనకున్న స్నేహాన్ని వాడుకుని మైక్రోసాఫ్ట్ ను రాష్ట్రం లోకి తెచ్చే ప్లాన్ చేశారు.

Also Read : బ్యాంక్ ఖాతాలపై సంచలన నిర్ణయం

చివరకు ఈ ప్లాన్ వర్కౌట్ అయింది. ఇప్పుడు ఏపీలో google తో పాటుగా పలు కీలక సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రకటించారు. త్వరలోనే గూగుల్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తుందన్నారు. ఇక google తో పాటుగా పలు కీలక ఆటోమొబైల్ సంస్థలు అలాగే సెల్ఫోన్ తయారీ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి.. ఆసక్తి చూపిస్తున్నాయి. దావోస్ పర్యటన ఫెయిల్ అయింది.. అనేది చాలామందిలో ఉన్న అభిప్రాయం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పలు కంపెనీల అధినేతలు.. వస్తారని అధికారుల సిద్ధంగా ఉండాలని చెప్పినా కొంతమంది సెటైర్లు వేశారు. ఇప్పుడు ఏపీలో గూగుల్ అడుగు పెడితే మాత్రం ఖచ్చితంగా అది సరికొత్త చరిత్ర.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్