ఎక్కడైనా సరే వ్యాపారం బలపడాలంటే అనుకూల వాతావరణం ఉండాలి. ప్రభుత్వ విధానాలు, రాజకీయ సుస్థిరత వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ 2019 నుంచి 24 వరకు ఇవి ఏపీలో లోపించాయి. రాజకీయంగా ప్రభుత్వం బలంగా ఉన్నప్పటికీ.. విధానాలు, చేష్టలు పెట్టుబడిదారులను భయపెట్టాయి. అదే 2024 లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ కు శాపంగా మారింది. కూటమి సర్కార్ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు.
Also Read : విశ్వంభరా.. ఇక లేనట్లేనా..?
దావోస్ పర్యటన కూడా పెద్దగా విజయవంతం కాలేదు. ఈ సమయంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అగ్రగామి ఐటీ కంపెనీలను ఆహ్వానించే పనిలో పడింది సర్కార్. మంత్రి నారా లోకేష్ ఐటీ రంగాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. అందులో భాగంగా గూగుల్ ను రాష్ట్రానికి తీసుకొచ్చారు. దీనితో ఐటీ రంగానికి బూస్ట్ దొరికినట్టు అయింది. ఇప్పటి వరకు భయపడిన పెద్ద సంస్థల నుంచి చిన్న కంపెనీల వరకు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. అనుబంధ సంస్థలు కూడా పెట్టుబడి పెడతాయి.
Also Read : మిధున్ రెడ్డిని రౌండప్ చేసిన సిట్..!
ఆటో మొబైల్ రంగానికి కూడా ఇది ఊతం ఇస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకుని రెవెన్యూ శాఖ ఆదాయం సైతం పెరిగే అవకాశం ఉంటుంది. మరిన్ని కంపెనీలు ఏపీలో అడుగుపెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో ఇప్పుడు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి దేశ ఐటీ పరిశ్రమ గతిని మార్చిన సిఎం చంద్రబాబు.. ఇప్పుడు గూగుల్ తో గేమ్ చేంజ్ చేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఏపీ ఆక్సీజన్ కు మించి అంటున్నారు పరిశీలకులు.