ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర ఓటమితో టీం ఇండియా హెడ్ కోచ్ గంభీర్ పై తీవ్ర ఒత్తిడి ఉంది. ఎలాగైనా సరే ఇంగ్లాండ్ తో టి20 సీరీస్ ను గెలవాలని పట్టుదలగా ఉన్న గంభీర్.. భారం మొత్తం దేవుడిపైనే వేసాడు. నేటి నుంచి ఇంగ్లాండ్ తో టి20 సీరీస్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో గౌతమ్ గంభీర్ కోల్‌కతా లోని ప్రఖ్యాత కాళీ మాత ఆలయాన్ని సందర్శించాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ తో జరగబోయే ఈ సీరీస్ అత్యంత కీలకమైంది. గత పదేళ్ళలో ఒక్కసారి కూడా ఇంగ్లాండ్ తో టి20 సీరీస్ ను భారత్ ఓడిపోలేదు.
Also Read : రూల్స్ పెడతాం.. ఫాలో అవ్వం.. కరుణ్ నాయర్ కు అన్యాయం…!
అయితే పదేళ్ళలో ఇండియా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా ఓడిపోలేదు. అలాగే శ్రీలంకలో వన్డే సీరీస్ కూడా. కాని గంభీర్ కోచ్ అయిన తర్వాత ఈ రెండు జరిగాయి. న్యూజిలాండ్ తో వైట్ వాష్ టీం ఇండియా కు ఘోర పరాభవంగా చెప్పాలి. దీనితో ఇంగ్లాండ్ తో సీరీస్ విషయంలో ఏం జరగబోతుందో అనే ఆందోళన అభిమానుల్లో కనపడుతోంది. ఇక సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ పునరాగమనంతో భారత్ జోష్ లో కనపడుతోంది. 2023 నవంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో చివరిసారిగా ఆడిన షమీ, మడమ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
Also Read : రామ్‌చరణ్ కెరీర్‌ను నాశనం చేసిన శంకర్
14 నెలల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు షమీ దూరంగా ఉన్నాడు. గత ఏడాది చివర్లో బెంగాల్ తరుపున రంజీ ట్రోఫీ బరిలో దిగిన షమీ.. ఆ తర్వాత దేశవాళి క్రికెట్ లో దుమ్ము రేపాడు. షమీ ఇప్పుడు మెరుగైన ప్రదర్శన చేస్తే.. మాత్రం కచ్చితంగా భారత్.. చాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్ లో టెస్ట్ సీరీస్ విషయంలో భారత్ కు బలం చేకూరినట్టే. ఇక అందరి కంటే ఈ సీరీస్ విషయంలో కోచ్ గంభీర్ పైనే ఒత్తిడి ఎక్కువగా కనపడుతోంది.