దక్షిణ భారతదేశంలోనే సంచలనం సృష్టించిన కేసు.. అధికారం అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచేసిన కేసు.. అదే ఓబులాపురం మైనింగ్ కేసు.. దాదాపు 15 ఏళ్లు పైగా ఈ కేసును విచారించిన నాంపల్లి సీబీఐ కోర్టు.. సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ఈ కేసులో అధికారం దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మాత్రం ఊరట లభించింది. కేసులో ఏ9గా ఉన్న సబితా ఇంద్రారెడ్డిని సీబీఐ కోర్టు నిర్దోషిగా తేల్చేసింది. అదే కేసులో కీలక ముద్దాయిగా ఉన్న గాలి జనార్థన్ రెడ్డికి మాత్రం ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది నాంపల్లి సీబీఐ కోర్టు.
Also Read : అరెస్ట్ చేసేయండి.. లిక్కర్ స్కాంలో సుప్రీం షాక్
ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు 15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ జరిపింది. ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ప్రధాన నిందితులుగా ఏ1 బీవీ శ్రీనివాసరెడ్డి, ఏ2 గాలి జనార్థన్ రెడ్డి, ఏ3 వీడీ రాజగోపాల్, ఏ4 ఓఎంసీ ప్రైవేట్ లిమిటెడ్, ఏ7 అలీఖాన్‌కు కోర్టు శిక్ష విధించింది. అలాగే ఏ8 గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ కృపానందం, ఏ9గా ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మాత్రం సీబీఐ కోర్టు నిర్దేషులుగా ప్రకటించింది. ఈ కేసులో అధికార దుర్వినియోగంతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (2), రెడ్ విత్ 13(1) (డీ) కింద సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. సాక్షులు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా సీబీఐ విచారణలో అంశాలను పరిగణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు శిక్షలు ఖరారు చేసింది.
Also Read : మా ఓటమికి వాళ్లే కారణం..!
ఓబులాపురం అక్రమ మైనింగ్‌పై 2009, డిసెంబర్ 7న సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. 2011లో మొదటి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మొదటి ఛార్జ్‌షీట్‌లోనే ఏ1, ఏ2లుగా ఉన్న గాలి జానార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు శ్రీనివాస్ రెడ్డి కలిసి అక్రమంగా ఓబులాపురం మైనింగ్స్ తవ్వి దాదాపు రూ.844 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చారు. ఈ కేసులో దాదాపు 219 మంది సాక్షుల స్టేట్‌మెంట్లను న్యాయస్థానం రికార్డ్ చేసింది. వారి స్టేట్‌మెంట్లు ఆధారంగా చేసుకుని ఈకేసులో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read : గంటా సమస్యకు దొరికిన పరిష్కారం..!
జగన్ ధన దాహానికి దేవుడు ఇచ్చిన అన్న గాలి జనార్థన్ రెడ్డి బలయ్యాడు. ఓబులాపురం అక్రమ మైనింగ్ వెనుక అసలు సూత్రధాని జగన్ మోహన్ రెడ్డి అనేది బహిరంగ రహస్యం. అయితే టెక్నికల్‌గా చట్టప్రకారం గాలి జనార్థన్ రెడ్డి మాత్రమే ఈ కేసులో నిందితుడు. ఓఎంసీ తవ్వకాల్లో వచ్చిన డబ్బును గాలితో కలిసి జగన్ మింగేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు. అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెబితేనే ఓఎంసీకి మైనింగ్ అనుమతులు ఇచ్చినట్లు అప్పట్లోనే సబితా ఇంద్రారెడ్డి, అధికారులు వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని సీబీఐ రుజువు చేయలేకపోయింది. కాబట్టి చట్టానికి దొరకకుండా జగన్ తప్పించుకున్నాడు. ఓబులాపురం మైనింగ్‌లో జగన్‌కు వాటా ఇచ్చినందుకే.. కడప జిల్లాలో బ్రహ్మణీ స్టీల్స్ సంస్థకు ఏకంగా 5 వేల ఎకరాలను నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం కేటాయించి ఆయాచిత లబ్ది కలిగించింది. ఓఎంసీ కేసులో దేవుడిచ్చిన అన్నకు శిక్ష పడింది. ఇక అక్రమాస్తుల కేసులో తమ్ముడికి కూడా తప్పకుండా 14 ఏళ్లు జైలు శిక్ష ఖాయమనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. దీనికి లిక్కర్ స్కామ్ అదనం.