పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వ్యవహారంలో అమలాపురం మాజీ ఎంపీ.. హర్ష కుమార్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇది ప్రమాదం కాదు అని చూపించేందుకు ఆయన తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఘటన స్థలానికి వెళ్లి అక్కడ పలు వీడియోలు రికార్డు చేయడమే కాకుండా క్రైస్తవులతో కలిసి హడావుడి చేస్తూ వచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి.. రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి.. ప్రతిపక్షాలకు సహకరించడానికి హర్ష కుమార్ తీవ్రంగా కష్టపడుతున్నారు అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.
Also Read : పాలిటిక్స్‌కు గుడ్ బై.. పెద్ద ప్లాన్ వేసిన బుగ్గన..!
హర్ష కుమార్ మాట్లాడిన మాటలు ఆయన చేస్తున్న వీడియోలు పై టిడిపి నుంచి స్పందన ఉండడం లేదు. టిడిపి దళిత నేతలు గాని క్రైస్తవ నేతలు గాని ఎవరూ కూడా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు కనపడటం లేదు. ఈ వ్యవహారంలో ఆయన చేసిన కామెంట్లు పై పోలీసులు సీరియస్గా తీసుకొని అరెస్టు చేయడమే గాని.. దళిత నేతలు కనీసం ఘటన స్థలానికి వెళ్లి లేదంటే పోలీసులు విడుదల చేసిన సీసీ ఫుటేజ్ లను మీడియాకు చూపించి ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు.
Also Read : అందుబాటులోకి వస్తున్న అన్న.. ప్యాలెస్ లో సందడి వాతావరణం
ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీల నేతలు మౌనంగానే ఉంటున్నారు. హర్ష కుమార్ చేసేది ఏంటో చాలామందికి క్లారిటీ ఉన్న ఇంకా మూడు పార్టీలకు మాత్రం క్లారిటీ రావడం లేదు. మీడియా ముందు హర్ష కుమార్ చేసేదాన్ని ఎండగట్టే అవకాశం ఉన్నా సరే మౌనంగా ఉండిపోతున్నారు. హర్ష కుమార్ తో పాటుగా కొంతమంది క్రైస్తవ సామాజిక వర్గ వ్యక్తులు గత వారం పది రోజుల నుంచి దీనిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పలు వీడియోలను విడుదల చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పలువురిని పోలీసులు అరెస్టు చేసిన సరే మరి కొంతమంది ఇప్పుడు బయటకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే కూటమి పార్టీల నేతలు మాత్రం మౌనం వహించడంపై సోషల్ మీడియాలో.. అసహనం వ్యక్తం అవుతుంది. చంద్రబాబు నాయుడుని అలాగే మంత్రి లోకేష్ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా సరే మౌనంగానే ఉండిపోతున్నారు కూటమి పార్టీల నేతలు.

