ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు విషయంలో దర్యాప్తు అధికారులు అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నారు. లిక్కర్ కేసు విషయంలో సర్కార్ సీరియస్ గా ఉండటంతో.. అధికారులు విచారణ విషయంలో కాస్త సీరియస్ గానే అడుగులు వేస్తున్నారు. తాజాగా మద్యం రవాణాకు సంబంధించి పలు విషయాలను సిట్ అధికారులు గుర్తించారు. ఇక తాజాగా మరో కీలక విషయం లిక్కర్ కేసులో వెలుగులోకి వచ్చింది. మద్యం రవాణా అక్రమాలపై ఈడీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read :Video : తెలంగాణలో టిడిపి చరిత్ర ముగిసిపోయిందా?
గత ప్రభుత్వ హయాంలో ఏపీఎస్బీసిఎల్ డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం రవాణా కాంట్రాక్టులో అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. రూ.400 కోట్ల దోపిడీ వ్యవహారంపై సీఐడీ కేసు నమోదు చేసింది. నిందితులుగా కారుమూరి నాగేశ్వరరావు, కుమారుడు సునీల్, కోడలు కీర్తి, చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అల్లుడు, ఏపీఎస్బీసిఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి బావమరిది నరసింహారెడ్డి ఉన్నట్లు గుర్తించారు.
Also Read : బ్రేకింగ్: ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు
నిందితుల్లో రాజ్ కెసిరెడ్డి, అనుచరులు బూనేటి చాణక్య, ఈశ్వర్ కూడా ఉన్నారని తేల్చారు. దీనితో వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంచితే.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. నిందితులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. ఇప్పటికే నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టు కొట్టివేయడంతో ఏపీ హైకోర్టును నిందితులు ఆశ్రయించారు. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.

