Friday, September 12, 2025 07:36 PM
Friday, September 12, 2025 07:36 PM
roots

అయ్యర్ కు అందుకే అన్యాయం..? గంభీర్ పై ఫ్యాన్స్ ఫైర్

భారత క్రికెట్ లో రాజకీయాలు సర్వసాధారణమే. ఈ విషయంలో ఎందరో ఆటగాళ్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ వంతు వచ్చింది. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న అయ్యర్ జాతీయ జట్టులోకి రావడానికి తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో ఆటగాడిగాను కెప్టెన్ గాను రాణించాడు. పంజాబ్ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లి జట్టు యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. అంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీలో సైతం అతను మెరుగ్గా రాణించాడు.

Also Read : సూర్య కుమార్ క్యాచ్ పై అంబటి సంచలన కామెంట్..!

దీనితో ఆసియా కప్ లో అతని పేరు ఉంటుందని భావించారు అభిమానులు. కానీ మంగళవారం ప్రకటించిన జట్టులో అతని పేరు లేకపోవడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఫెయిల్ అయిన శివం దూబేకి జట్టులో చోటు కల్పించారు. అతనికంటే అయ్యర్ విలువైన ఆటగాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ అనే పేరుతో అతనికి అవకాశం ఇచ్చింది సెలక్షన్ కమిటీ. అయితే దీని వెనుక గౌతమ్ గంభీర్ తో అయ్యర్ కు ఉన్న విభేదాలే కారణం అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. 2024 ఐపీఎల్ సీజన్ లో గంభీర్, అయ్యర్ కలకత్తా జట్టుకు కలిసి పని చేశారు.

Also Read : తెలుగు ఆల్ రౌండర్ కు దక్కని చోటు.. ఆసియా కప్ జట్టు ఇదే..!

కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు ముందు.. కలకత్తా జట్టు అయ్యర్ ను వదిలేసింది. దీనికి ప్రధాన కారణం గంభీర్ అనేది అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పంజాబ్ జట్టు దాదాపు 27 కోట్లు ఖర్చుపెట్టి అతన్ని కొనుగోలు చేసింది. వెంటనే కెప్టెన్ గా కూడా అవకాశం ఇచ్చింది. ముందు నుంచి అయ్యర్ తో విభేదాలు ఉన్న గంభీర్ అతనిని పక్కన పెట్టడానికి భారత ప్రధాన కోచ్ గా ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు అంటున్నారు అభిమానులు. అందుకే ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ జట్టులో కూడా అతనికి చోటు కల్పించలేదని.. ఇప్పుడు ఆసియా కప్ లో కూడా అతనికి అవకాశం ఇవ్వలేదని మండిపడుతున్నారు. ప్రస్తుతం అయ్యర్ వయసు 30 ఏళ్లు కాగా మరో రెండేళ్లపాటు గంభీర్ కోచ్ గా అప్పటివరకు అతను ఇబ్బంది పడాల్సిందే అంటున్నారు అభిమానులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్