Wednesday, February 4, 2026 06:53 PM
Wednesday, February 4, 2026 06:53 PM

విలువల్లేని బిగ్ బాస్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ

హిందీలో ప్రాణం పోసుకున్న బిగ్ బాస్ తెలుగులో ఓ రేంజ్ లో ఫేమస్ అయింది. ప్రస్తుతం 9 వ సీజన్ నడుస్తున్న ఈ బిగ్ బాస్ కార్యక్రమం గత కొన్ని రోజులుగా విమర్శలకు వేదికగా మారింది. ఇప్పటివరకు చూసిన ప్రేక్షకులు కూడా షో విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక స్క్రిప్ట్ ప్రకారం బిగ్ బాస్ నడుస్తోందని.. ఎలిమినేషన్లు కూడా అలాగే జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. వ్యూస్ పెంచేందుకు స్టార్ మా యాజమాన్యం తీసుకొస్తున్న కంటెస్టెంట్ల విషయంలో కూడా విమర్శలు వస్తున్నాయి. అసలు ఎందుకు వివాదం అనేది ఒకసారి చూద్దాం.

Also Read : పాత చంద్రబాబును చూడబోతున్నామా.. క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం..?

ఇటీవల శ్రీజ అనే అమ్మాయిని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. కానీ ప్రేక్షకుల వాదన ప్రకారం ఆ అమ్మాయికి ఎక్కువగా ఓట్లు వచ్చాయి. అయినా సరే అన్యాయంగా ఆ అమ్మాయిని బయటకు పంపించారని.. ప్రేక్షకులు ఓటు వేసిన సరే స్టార్ మా యాజమాన్యం, షో నిర్వాహకులు అనుకున్నదే చేస్తున్నారని.. అలాంటప్పుడు ఓట్లు వేయడం ఎందుకని అభిమానులు మండిపడుతున్నారు. ఆమెను తిరిగి మళ్లీ షోలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దివ్వల మాధురి, అలేఖ్య చిట్టి పీకిల్స్ నిర్వహించే రమ్య విషయంలో కూడా ఇలాగే విమర్శలు వచ్చాయి.

Also Read : తుది దశకు మావోయిస్టు ఉద్యమం.. టార్గెట్ సాధించిన అమిత్ షా

వీళ్ళిద్దరి విషయంలో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు ఉన్నాయి. భాష విషయంలో రమ్య పై ఇప్పటికీ చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆమెను వ్యూస్ కోసం తీసుకువచ్చారని ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇక మాధురి, దువ్వాడ శ్రీను వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. శ్రీను కుటుంబ సభ్యులను వదిలేసి ఆమెతో తిరగడంపై మహిళలు అనేకసార్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఆమెను వైల్డ్ కార్డు ఎంట్రీ పేరుతో బిగ్ బాస్ లోకి తీసుకురావడం కరెక్ట్ కాదని విమర్శలు వచ్చాయి. ఇంకా ఆమె వాడుతున్న భాష, ఆమె ప్రవర్తన పై కూడా విమర్శలు ఉన్నాయి. ఇక బిగ్ బాస్ లో కొందరి వస్త్రధారణ, వారి ప్రవర్తన చూసి ఓయో రూముగా మారిందని మండిపడుతున్నారు. కర్ణాటక తరహాలో ఈ షో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నైతిక విలువలు, కుటుంబ విలువలు లేని వ్యక్తులకు బిగ్ బాస్ ఆశ్రయం కల్పిస్తోందని మండిపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్