Monday, October 27, 2025 11:41 PM
Monday, October 27, 2025 11:41 PM
roots

ప్రజ్వల్ రేవన్నకు కోర్ట్ బిగ్ షాక్.. పొలిటికల్ కెరీర్ ఖతం..!

2024 ఎన్నికల సమయంలో సంచలనం సృష్టించిన అత్యాచారం ఘటన కేసులో.. మాజీ ఎంపీ, జనతాదళ్ (సెక్యులర్) మాజీ నేత, ప్రజ్వల్ రేవణ్ణకు కోర్ట్ షాక్ ఇచ్చింది. ఆయనకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు శనివారం జీవిత ఖైదు విధించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల కోసం నియమించిన న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ అధ్యక్షతన ఏర్పాటైన కోర్ట్ శుక్రవారం 34 ఏళ్ల ప్రజ్వల్ ను దోషిగా నిర్ధారించింది. అతనిపై నమోదైన నాలుగు అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో ఇది మొదటిది.

Also Read : రెండు తప్పులు సీరీస్ ను ముంచాయా..?

అతనికి పది లక్షల జరిమానా కూడా విధించింది కోర్ట్. నేరం తీవ్రతను ప్రస్తావిస్తూ.. జీవిత ఖైదు విధించాలని ప్రాసిక్యూషన్ శిక్ష విచారణ సమయంలో కోర్టు ముందు తన వాదనలు వినిపించింది. హసన్ జిల్లా హోలెనరసిపురలోని రేవన్న కుటుంబానికి చెందిన గన్నికాడ ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న 48 ఏళ్ల పని మనిషిపై అత్యాచారానికి సంబంధించిన కేసు ఇది. 2021లో ఆమెపై రెండుసార్లు దాడి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఒకసారి ఫామ్‌హౌస్‌లో, తరువాత బెంగళూరులోని ఒక ఇంట్లో జరిగాయి.

Also Read : జగన్ కోసం షార్ప్ షూటర్స్ కామెంట్.. మాయమైపోయిన జర్నలిస్ట్

ఈ చర్యలను రేవన్న తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసినట్లు గుర్తించినట్టు సమాచారం. అంతకుముందు రోజు, ప్రాసిక్యూషన్ రేవన్నకు జీవిత ఖైదు విధించాలని కోరగా, 34 ఏళ్ల రేవన్న తాను ఏ తప్పు చేయలేదని, రాజకీయాల్లో వేగంగా ఎదగడమే తన ఏకైక తప్పు అంటూ క్షమాభిక్ష కోరాడు. తక్కువ శిక్ష విధించాలని న్యాయమూర్తికి అప్పీల్ చేసుకుంటూ కోర్టులోనే విలపించడం గమనార్హం. తాను బిఇ మెకానికల్ గ్రాడ్యుయేట్ అని, ఎప్పుడూ మెరిట్‌ స్టూడెంట్ అని చెప్పుకొచ్చాడు. ఏ స్త్రీ కూడా తనపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని.. ఎన్నికలకు ముందు తీసుకొచ్చి ఫిర్యాదు చేయమని ఒత్తిడి చేసారని ఆవేదన వ్యక్తం చేసాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్