Friday, September 12, 2025 11:18 PM
Friday, September 12, 2025 11:18 PM
roots

కాకినాడ పోర్ట్ కేసు.. వైసీపీ నేతలకు ఉచ్చు బిగించిన ఈడీ…!

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం చేసిన ఆగడాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పుడు చాలా మందిని చాలా రకాలుగా వేధించి తమ వ్యాపారాలను కూడా ఇబ్బంది పెట్టి వైసీపీ నేతలు అనుసరించిన వైఖరిపై ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కాకినాడ పోర్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో స్వయంగా జోక్యం చేసుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అక్రమంగా వాటాలను లాక్కున్నారు అనే ఆరోపణలు వినిపించాయి. ఈ నేపధ్యంలో దీనిపై తాజాగా కేసు నమోదు చేసారు అధికారులు.

గత ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్ లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగించింది. కేఎస్పీఎల్ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఎఆర్ ఆధారంగా రంగంలోకి దిగింది ఈడీ. ఇప్పటికే ప్రాథమిక విచారణ కూడా పూర్తి చేసింది. భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించారు. దాని ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేయనున్నారు.

Also Read :పొంగులేటి వ్యాఖ్యల వెనుక ఇంత కుట్ర ఉందా…?

కేసులో నిందితులైన వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తనయుడు వై.విక్రాంత్రెడ్డి, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు, అరబిందో సంస్థ యజమాని పెనక శరత్చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీ సంస్థగా పేరొందిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ప్రతినిధులకు ఈడీ ఇటీవల నోటీసులు కూడా ఇచ్చింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున తాను విచారణకు రాలేనంటూ విజయసాయిరెడ్డి, అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేనంటూ విక్రాంత్రెడ్డి, ప్రస్తుతం విచారణకు రావటం కుదరదంటూ శరత్ చంద్రా రెడ్డి… ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా జవాబు ఇచ్చారు. ఈడీ మరోసారి వారికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్