Friday, September 12, 2025 11:20 PM
Friday, September 12, 2025 11:20 PM
roots

నీ తాట తీస్తా.. రెచ్చిపోయిన దువ్వాడ..!

నేనెవరో తెలుసా.. నువ్వు ఎవరింటికి వచ్చావో తెలుసా.. నీ సంగతి తేలుస్తా.. ఈ మాటలు అన్నది సాక్ష్యాత్తు ఓ ఎమ్మెల్సీ. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి.. ఇలా అధికారులను బెదిరిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి రెచ్చిపోయారు. ఇప్పటి వరకు ప్రత్యర్థులపై నోరు పారేసుకున్న దువ్వాడ.. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ అధికారికే వార్నింగ్ ఇచ్చారు. బిల్లు చెల్లించని కారణంగా విద్యుత సరఫరా నిలిపివేయడంతో.. సదలు ఎమ్మెల్సీ గారికి కోపం వచ్చింది. అది కూడా ఆయన ఇంటికి కాదు.. ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి ఇంటికి కరెంట్ కట్ చేసినందుకు సార్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నువ్వు కనెక్షన్ కట్ చేసిన ఇల్లు ఎవరి పేరు మీద ఉందో తెలుసా.. అంటూ రెచ్చిపోయారు. నీ సంగతి తేలుస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.

Also Read : ఏపీ పోలీసుల కొత్త అవినీతి.. వైసీపీ అండదండలతో

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నోటి దూల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి టార్గెట్ చేసి మరీ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, ఆ తర్వాత టీడీపీలో చేరినప్పుడు కాంగ్రెస్ నేత ధర్మాన ప్రసాదరావుపైన, ఇక వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పైన నోటికి వచ్చినట్లు రెచ్చిపోయారు. ఇక ప్రస్తుత మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇంటి మీదకు దాడికి కూడా యత్నించారు. రాయలేని భాషలో దుర్భాషలాడుతూ.. హత్యాయత్నానికి కూడా తెగబడ్డాడు దువ్వాడ శ్రీనివాస్. ఇదే సమయంలో సొంత కుటుంబ వ్యవహారాలతో పరువు పొగొట్టుకున్నాడు. భార్య, కుమార్తెలను బజారులో పెట్టి.. మరో మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి వ్యవహారం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా కూడా మారిపోయింది.

Also Read : నాగబాబుకు బ్రేక్.. కారణమిదే..!

తాజాగా తన నిచ్చెలి.. అనధికార సహధర్మచారిణి దివ్వెల మాధురి ఇంటికి విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేశారు. బిల్లు చెల్లించని కారణంగా లైన్ కట్ చేసేశారు. ఈ విషయం ఎమ్మెల్సీ దువ్వాడకు దివ్వెల మాధురి ఫిర్యాదు చేశారు. ఇక అంతే.. సార్‌కు కోపం వచ్చింది. విద్యుత్ శాఖ ఏఈకి ఫిర్యాదు చేశారు. నా ఇంటికే వచ్చి కరెంట్ కట్ చేస్తావా అంటూ బెదిరించారు. నాలుగైదు సార్లు నోటీసులిచ్చామని అధికారి చెబుతున్నా కూడా.. వినిపించుకోలేదు. పైగా ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి కట్ చేశావంటే.. ఎంత ధైర్యం నీకు.. అంటూ రెచ్చిపోయారు. “ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు.. నీ మీద కన్జ్యూమర్ కోర్టుకు లాగి.. నీ జీవితం మొత్తం పీల్చి పిప్పి చేస్తా ఉండు.. ఎవరితో పెట్టుకున్నావో చూపెడతాను” అంటూ బెదిరించారు. మాధురి ఇంటికే కరెంట్ కట్ చేస్తావా అంటూ ఏఈని దుర్భాషలాడారు. “నిన్ను కోర్టుకు లాగుతాను.. నీకు నరకం చూపెడతాను. నా ఇంటి మీదకే వస్తావా.. ఎంత ధైర్యం నీకు. టెక్కలి నుంచి పారిపోయేలా చేస్తాను.. టెక్కలిలో ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తాను నాయాలా..” అంటూ దళిత అధికారిని దువ్వాడ శ్రీనివాస్ బెదిరించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్