Wednesday, August 5, 2026 06:42 AM
Wednesday, August 5, 2026 06:42 AM

పెళ్లి కూతురులా ముస్తాబైన బెజవాడ..!

దసరా ఉత్సవాలకు బెజవాడను అంగరంగ వైభవంగా ముస్తాబు చేసింది దేవాదాయ శాఖ. పర్యాటక శాఖ సహకారంతో నగర వ్యాప్తంగా ఎక్కడిక్కడ పెళ్లి కూతురులా ముస్తాబు చేసారు అధికారులు. అటు మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. దుర్గమ్మ ఫ్లైఓవర్, ప్రకాశం బ్యారేజ్, వినాయక ఫ్లై ఓవర్, బస్టాండ్ పరిసరాలు, ఎంజీ రోడ్, ఏలూరు రోడ్ ఇలా ప్రతీ ఒక్క ప్రాంతాన్ని ఎంతో అందగంగా ముస్తాబు చేసారు అధికారులు.

Also Read : లిక్కర్ కేసు సిబిఐకే..? చంద్రబాబు సంచలనం..!

అటు ప్రకాశం బ్యారేజ్ కు వరద కూడా రావడంతో.. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కృష్ణమ్మ కనువిందు చేయనుంది. గతంలో ఈ స్థాయిలో వరద వచ్చిన సందర్భాలు తక్కువ. ఇక ఎంత మంది భక్తులు వచ్చినా సరే ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను కంట్రోల్ చేసే ఏర్పాట్లు చేసారు. ప్రకాశం బ్యారేజ్ పైకి కార్లను కూడా అనుమతించడం లేదు అధికారులు. హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారీ క్యూలైన్ కూడా ఏర్పాటు చేసారు.

Also Read : లిక్కర్ స్కామ్ ని మించిన మరో కుంభకోణం బయటపెట్టిన ఏబివి

అటు స్నానాల ఘాట్ ల వద్ద కూడా జాగ్రత్తలు తీసుకుంది పర్యాటక శాఖ. స్నానాలు చేసే భక్తులకు ఏ విధంగా ఇబ్బందులు లేకుండా స్నానాల ఘాట్ ల వద్ద ఏర్పాటు చేసారు. గత కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఘాట్ లను సమర్ధవంతంగా వినియోగించుకుంటున్నారు అధికారులు. అటు లైటింగ్ విషయంలో కూడా ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేసారు. రాత్రి సమయాల్లో ప్రకాశం బ్యారేజ్, ఫ్లై ఓవర్లు, కొండ ప్రాంతాలు అన్నీ ఎంతో అద్భుతంగా కనపడేలా లైటింగ్ ఏర్పాటు చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్