నిన్నటి వరకు ఆ ఇద్దరు ఆప్తులు.. అత్యంత సన్నిహితులు.. ఇంకా చెప్పాలంటే.. ఒకరి కోసం ఒకరు ఎంతో సాయం చేసుకున్నారు. ఇదంతా నిన్నటి మాట.. మరి ఇప్పుడు.. బద్ధ శత్రువులు.. కయ్యానికి కాలు దువ్వుతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నారు. నా వల్లే నువ్వు ఈ స్థాయికి వచ్చావని ఒకరంటే.. అసలు నేను లేకపోతే నీ పరిస్థితి ఏమిటో తెలుసుకో అని మరొకరు వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరనుకుంటున్నారా.. మరెవరో కాదు.. ఒకరు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయితే.. మరొకరు ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ట్రంప్ గెలుపు కోసం తాను ఎంతో కృషి చేసినట్లు మస్క్ చెబుతుంటే.. నా ముఖం చూసే ప్రజలు ఓట్లు వేశారనేది ట్రంప్ మాట.
Also Read : అరెస్ట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో సంచలనం
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ తరఫున మస్క్ ప్రచారం చేశారు. మరో అడుగు ముందుకు వేసిన మస్క్… ఓటర్ల ఖాతాలో డబ్బులు కూడా జమ చేశారు. ప్రతి ఓటుకు 45 డాలర్లు పంచినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై విచారణ కూడా జరిపించిన అక్కడి కోర్టు.. ఓటుకు నోటు ఇవ్వడం తప్పేమి కాదని తీర్పు కూడా ఇచ్చింది. వాస్తవానికి మస్క్ డబ్బులివ్వటం కొత్తేమి కాదు. ట్రంప్‌కు మద్దతు తెలిపిన మస్క్.. ఆయన ప్రచారానికే ఏకంగా 75 మిలియన్ డాలర్లు ఇచ్చేశారనేది అప్పట్లో పెద్ద దుమారం రేపింది. పెన్సిల్వేనియా ఓటర్లకు అయితే రోజుకు మిలియన్ డాలర్ల ఆఫర్ కూడా చేశారు. అలాగే పెన్సిల్వేనియా చుట్టుపక్కన ఉండే రాష్ట్రాల్లోని ఓటర్లు రిపబ్లికన్ పార్టీకి మద్దతు చేసి.. పీఏసీకి అనుకూలంగా సంతకం చేస్తే.. 47 డాలర్లు ఇస్తానంటూ బహిరంగ ప్రకటన కూడా చేశారు మస్క్. ఈ ఆఫర్ రిఫర్ చేసిన వారికి కూడా వర్తిస్తుందని ప్రకటించారు. ఈ ప్రకటన అప్పట్లో పెద్ద దుమారం రేపింది కూడా.
Also Read : ఇంగ్లీష్ టూర్ ముందు రెండు దేశాలు కీలక నిర్ణయం
అయితే ప్రస్తుతం ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి మస్క్‌తో చేసుకున్న ఒప్పందాలను ట్రంప్ సర్కార్ రద్దు చేయగా.. ఇది టెస్లా సంస్థపై ప్రభావించింది. అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్‌కు మద్దతుగా మస్క్ ప్రచారం చేశారు. ఫలితాల తర్వాత కూడా ట్రంప్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా ట్రంప్‌కు అనుకూలంగా పోస్టులు పెట్టించారు. ప్రత్యర్థులపై దాడులు కూడా చేయించారు. అయితే ట్రంప్ పాలన మొదలై ఏడాది కూడా పూర్తికాక ముందే.. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇందుకు ప్రధానంగా ట్రంప్ తీసుకొచ్చిన ది బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లు. దీనిపై ఎలాన్ మస్క్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే పరిపాలన సౌలభ్యం కోసం డోజ్ వ్యవస్థను ట్రంప్ సర్కార్ ఏర్పాటు చేసింది. అయితే ఈ డోజ్ వ్యవస్థ నుంచి కూడా మస్క్ వైదొలిగి ట్రంప్‌కు షాక్ ఇచ్చారు.
Also Read : పవన్ ఫ్యాన్స్ కు వెయిటింగ్ తప్పదు.. రిలీజ్ అప్పుడే
రిపబ్లికన్స్ తీసుకువచ్చిన ట్యాక్స్ బిల్లుతో ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ బిల్లు కారణంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని మస్క్ ఆరోపించారు. అలా ఏం జరగదని ట్రంప్ ఇచ్చిన కౌంటర్‌తో ఇద్దరి మధ్య బంధం తెగిపోయినట్లైంది. ట్రంప్‌తో మాటల యుద్ధం మస్క్ వ్యాపారంపై కూడా పడింది. టెస్లా సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ సమయంలో సోషల్ మీడియాలో మస్క్ ఓ పోల్ పోస్టు పెట్టారు. ఇందులో తాను రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్లు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టే సమయం ఆసన్నమైంది అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ పోల్‌ను మస్క్ పిన్ చేశారు. మస్క్ పెట్టిన ఈ పోస్ట్‌కు 80 శాతం మంది తమ మద్దతు తెలిపారు. దీంతో త్వరలో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ వస్తుందనే మాట పెద్ద దుమారం రేపుతోంది.
Also Read : ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేందుకు బాబు, పవన్ రెడీ
ట్రంప్ పోస్ట్‌పై విభిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. కొత్త రాజకీయ పార్టీ అవసరం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరేమో.. ట్రంప్‌తోనే ఉండాలంటూ మస్క్‌కు సలహాలిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు కూడా. డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఉన్నారని.. ఈ రెండు నచ్చనివారికి లిబర్టేరియన్ పార్టీ కూడా ఉంది. ఇప్పుడు నువు మళ్లీ కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై మస్క్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో మస్క్ కొత్త పార్టీ ప్రారంభిస్తారా.. లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.




