Friday, September 12, 2025 01:02 AM
Friday, September 12, 2025 01:02 AM
roots

ఆయనకు ఎందుకు కోపం వచ్చిందంటే..?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎందుకిలా మాట్లాడారు..? అసలు ఆయన మాటల వెనుక కారణాలేమిటి..? దేవినేని ఉమా చెప్పిన మాటలు నిజమేనా..? ఇవే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా, చంద్రబాబు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న నేత దేవినేని ఉమా. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా తనదైన శైలిలోనే వ్యవహరించారు. 1999లో అన్న దేవినేని వెంకట రమణ మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఉమ.. నందిగామ నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2004లో టీడీపీ ఓడినా.. ఉమా మాత్రం గెలిచారు. 2009లో నందిగామ ఎస్సీ రిజర్వుడు కావడంతో.. మైలవరం నుంచి పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 – 2014 మధ్య కాలంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీ నేతలపై తనదైన శైలిలో దూకుడుగానే వ్యవహరించారు దేవినేని ఉమా.

Also Read : బిగ్ బాస్ అరెస్టు ఖాయమా..?

ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా దేవినేని ఉమాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమాకు కీలకమైన జల వనరుల శాఖ కేటాయించారు. పోలవరం సహా కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కడంలో ఉమా కీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో ఓడిన ఉమాకు కష్టాలు మొదలయ్యాయి. వైసీపీ ప్రభుత్వంలో ఉమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు ఉమా. అయితే 2024 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడంతో మైలవరం టీడీపీ టికెట్ ఆయనకే ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి ఉమా సైలెంట్‌ అయ్యారనే చెప్పాలి. ఎమ్మెల్సీగా, రాజ్యసభ అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ ఏడాది దాటినా కూడా ఉమా ఊసే లేదు. దీంతో ఉమాను అధినేత మర్చిపోయారా.. లేక పూర్తిగా పక్కన పెట్టేశారా అనే మాట బాగా వినిపిస్తోంది.

Also Read : బాలయ్యపై ఎందుకీ అక్కసు..?

తాజాగా దేవినేని ఉమా పేరుతో ఓ ఫోన్ కాల్ వైరల్‌గా మారింది. టీడీపీ సీనియర్ నేత కరాటం రాంబాబు‌తో ఉమా మాట్లాడిన ఫోన్ కాల్.. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్లైంది. పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురించి ప్రస్తావించిన దేవినేని ఉమా.. కూటమి ప్రభుత్వ తీరుపై కూడా ప్రజల్లో అసహనం ఉందని వ్యాఖ్యానించడం పెద్ద దుమారం రేపింది. ఏడాది కాలంలో బాలరాజు వంద కోట్లు సంపాదించారంట కదా.. ఇప్పుడే ఆయన గొప్పతనం యూ ట్యూబ్‌లో చూశా.. ఏడాదిలోనే ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎలా..? పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇలాంటి వారి గురించి పట్టించుకోవటం లేదా..? అంటూ కరాటం రాంబాబు‌తో దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఏడాదిలోనే వంద కోట్లా… మీ ఎమ్మెల్యే దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించారు కదా.. అంటూ కరాటం రాంబాబుతో దేవినేని ఉమా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. అయినా నాలుగేళ్లు ఉంది కదా.. ఏడాదిలోనే ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నారెందుకు.. అని ఉమా ప్రశ్నించారు.

Also Read : ఇండియాకు ఆయిల్ ఎగుమతి చేసే దమ్ము పాక్ కు ఉందా..? లెక్కలు ఇవే..!

ఇది ఎమ్మెల్యేకే కాదని.. పార్టీకి కూడా చెడ్డ పేరు అని రాంబాబు బదులిచ్చారు. తన దగ్గరికి వచ్చినప్పుడు మందలించానని.. కానీ తీరులో ఎలాంటి మార్పు రాలేదంటూ రాంబాబు చేసిన వ్యాఖ్యలు.. జనసేన ఎమ్మెల్యే బాలరాజు అవినీతి చేస్తున్నారనే విషయాన్ని ఖరారు చేసినట్లైంది. కంట్రోల్ చేస్తున్నాం.. కానీ మళ్లీ మామూలు స్థితికి తీసుకు రావాలంటే.. చాలా సమయం పడుతుంది.. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భయపడుతున్నామంటూ కరాటం రాంబాబు చెప్పిన మాటలు.. ఎమ్మెల్యేల పనితీరుకు అద్దం పడుతున్నాయి. ఈ ఆడియో విన్న వారు ఎవరికైనా సరే.. నిజంగానే కూటమి ప్రభుత్వంలో ఈ స్థాయిలో అవినీతి ఉందా.. ఎమ్మెల్యేలు ఈ రేంజ్‌లో అక్రమార్జన చేస్తున్నారా.. అనే అనుమానాలు రావడం ఖాయం. ఈ ఆడియోపై దేవినేని ఉమా ఎలాంటి వివరణ ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీనిపై పార్టీ పెద్దలు ఏమైనా చర్యలు తీసుకుంటారా.. లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్