శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం 19-11-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.
మేషం 19-11-2025
వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి వివాదాలుంటాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
—————————————
వృషభం 19-11-2025
వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విశేషాలు తెలుస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
—————————————
మిధునం 19-11-2025
గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. బందుమిత్రులతో సక్యతగా వ్యవహారిస్తారు.
—————————————
కర్కాటకం 19-11-2025
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. దైవచింతన కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
—————————————
సింహం 19-11-2025
వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
—————————————
కన్య 19-11-2025
వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సన్నిహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
—————————————
తుల 19-11-2025
ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. పాత మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులుంటాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. రుణయత్నాలు వేగవంతం చేస్తారు.
—————————————
వృశ్చికం 19-11-2025
చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు నుండి బయటపడతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.
—————————————
ధనస్సు 19-11-2025
వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పాత ఋణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.
—————————————
మకరం 19-11-2025
నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఋణగ్రస్తుల నుండి రావలసిన సొమ్ము వసూలవుతుంది.
—————————————
కుంభం 19-11-2025
చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.
—————————————
మీనం 19-11-2025
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి.
—————————————

