శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం 25-02-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..
మేషం
నూతన వస్తు, వాహన లాభాలు పొందుతారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. ప్రభుత్వం తరపు నుంచి కొన్ని సహాయ సహకరాలు అందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి నుంచి పదకొండో స్థానంలో పంచగ్రహి కలయిక కారణంగా కెరీర్ పరంగా మంచి పురోగతి లభించే అవకాశం ఉంది. రాహువు, కుజుడి కలయికతో మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి.
వృషభం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలు తప్పవు. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వలన వృధా ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఈరోజు ఐదు గ్రహాల కలయిక కారణంగా కెరీర్ పరంగా గణనీయమైన అవకాశాలు లభించనున్నాయి.
మిధునం
కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తొలగుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదురవ్వొచ్చు. అయితే మీ కుటుంబం, స్నేహితులతో సరదాగా గడుపుతారు.
కర్కాటకం
ఆర్థిక పరమైన ఒడిదుడుకుల నుండి బయటపడతారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగైన లాభాలొచ్చే అవకాశం ఉంది. మీకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి.
సింహం
దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి. సింహ రాశి వారికి ఈరోజు సూర్యుడు, కుజుడి ప్రభావంతో కెరీర్ పరంగా మంచి పురోగతి లభించే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి సప్తమ స్థానంలో పంచగ్రహి యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
కన్య
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదర సంబంధిత విషయమై మాటపట్టింపులు ఉంటాయి. ఇంటాబయట ఋణపరమైన ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. చంద్రుడి ప్రభావంతో ఆదాయం పెరగొచ్చు. అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో ఉండే వ్యక్తులకు కొంత నష్టాలు రావొచ్చు.
తుల
నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలను జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఈరోజు సరైన సమయంలో మీరు చేసే పనుల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. అయితే మీరు పనులన్నీ నిబంధనల ప్రకారం చేయాలి. మీ పనుల కోసం ఇతరులపై ఆధారపడకూడదు.
వృశ్చికం
ఈరోజు మీకు అద్భుతమైన రోజు. ఆర్థికంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు లావాదేవీలు అద్భుతంగా సాగడంతో పెద్ద మొత్తంలో ధన లాభాలు చేతికి అందుతాయి. మీరు తలపెట్టిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాల కోసం దూరప్రాంత ప్రయాణాలు చేయవలసి రావచ్చు. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం మీకు లభిస్తుంది. టెక్నికల్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో డాక్టర్ల సలహాలు తీసుకుంటారు. ఉగ్ర నరసింహ స్వామి ఆరాధన మీకు శుభాలను కలిగిస్తుంది.
ధనస్సు
ఉద్యోగులకు మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు తమ భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు మీకు అస్సలు మంచిది కాదు. వ్యాపారస్తులకు ఆర్థికంగా పెద్దగా అనుకూలమైన రోజు కాదు. వచ్చింది పది రూపాయలు అయితే పోయేది వంద రూపాయలు అన్నట్టుగా మీ ఖర్చులు ఉంటాయి. అత్యాశతో కూడిన పెట్టుబడులు మీకు నష్టాలు తీసుకొస్తాయి. వాహన ప్రయాణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. శివారాధన మీకు ఊహించని సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది.
మకరం
ఈరోజు మీకు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఊహించని విధంగా లాభాలు పొందుతారు. ఎప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్న కొన్ని ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. రాజకీయ నాయకులకు ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులు తమ పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు సాగిస్తారు. నిరుద్యోగులకు మాత్రం ఈరోజు పెద్దగా అనుకూలంగా లేదు. శివుడి గాయత్రి మంత్ర జపం మీకు అనుకూలతలను కలిగిస్తుంది.
కుంభం
ఈరోజు మీకు కాస్త ప్రశాంతంగానే గడుస్తుంది. వ్యాపారస్తులకు చెప్పుకోదగ్గ లావాదేవీలు జరగటంతో ఆర్థికంగా రోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఆర్థికపరమైన విషయాలు కుటుంబ సభ్యులతో కఠినంగా వ్యవహరించడం మీకు ఇంట్లో వ్యతిరేకతను పెంచి మనశ్శాంతిని తగ్గిస్తుంది. గృహ నిర్మాణ పనులు సానుకూలంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పని భారం అధికంగా ఉన్నప్పటికీ అధికారులతో సత్సంబంధాలు సంతోషాన్ని కలిగిస్తుంది. మీ పక్కనే ఉండి మీ చెడు కోరుకునే వారితో కాస్త అప్రమత్తంగా ఉండండి. శివారాధన మీకు రోజు సానుకూలంగా గడవడానికి సహాయపడుతుంది.
మీనం
ఈరోజు మీకు అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. వాటికోసం మీరు సేవింగ్స్ నుంచి డబ్బు తీసి ఖర్చు పెట్టవలసి రావచ్చు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించిన లాభాలు కనిపించక నిరాశగా రోజు గడుస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో పని పై శ్రద్ధ అవసరం. ఉద్యోగ బాధ్యతలలో నిర్లక్ష్యం మీకు లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది. బదిలీల కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగులకు నిరాశ ఎదురవుతుంది. మొత్తానికి ఈరోజు మీకు పరీక్ష కాలంగా నడుస్తుంది. మౌనంగా ఉండి రోజును పూర్తి చేసుకోండి. ఆ ముక్కంటి ఆరాధన మీకు అనుకోని సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది.
గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

