Friday, March 27, 2026 09:10 PM
Friday, March 27, 2026 09:10 PM

బస్సు ప్రమాదం.. వైద్య ఆరోగ్య శాఖపై విమర్శలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108 నంబర్ పని చేస్తుందా.. ప్రమాదం జరిగినప్పుడు ఆదుకోవాల్సిన 108 అంబులెన్సులు సరిగ్గా నడుస్తున్నాయా.. 108 నంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే అంబులెన్స్ వస్తుందా.. అసలు 108 సిబ్బంది వేగంగా స్పందిస్తారా.. అంబులెన్స్ రావాలంటే 20 సార్లు ఫోన్ చేయాలా.. ఇవే ఇప్పుడు ఏపీలో వినిపిస్తున్న ప్రశ్నలు. మార్కాపురం జిల్లా రాయవరం పలకల క్వారీల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారు. టిప్పర్‌ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీ కొట్టిన ప్రమాదంలో మంటలు చెలరేగి ప్రయాణీకులు అగ్నికి ఆహుతయ్యారు. సుమారు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్ రావటం ఆలస్యమైందనే విమర్శలు ఇప్పుడు ఏపీ సర్కార్ పని తీరును ప్రశ్నిస్తున్నాయి.

ప్రమాదంలో గాయపడిన వారిని మార్కాపురం జిల్లా వైద్యశాలలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు పరామర్శించారు. ఆ సమయంలో ఒక బాధితురాలు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో చెప్పిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. 108కు 20 సార్లు ఫోన్ చేశాను.. అంబులెన్స్ ముందుగా వచ్చి ఉంటే.. కొంతమంది బతికే వారు అని వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఏపీకి కావాల్సింది డ్రోన్ ట్యాక్సీలు కాదని.. ప్రజలకు అవసరమైన అంబులెన్సులనే విషయం చంద్రబాబుకు తెలియదా అని విమర్శిస్తున్నారు. 100 నంబ‌ర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫ‌లితం లేద‌ని, 108కు 20 సార్లు ఫోన్ చేస్తే అప్పుడు స్పందించార‌ని.. మార్కాపురం జీజీహెచ్‌కు వచ్చిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఎదుట ఈ విషయాన్ని ఓ బాధిత యువతి వెల్లడించిందని.. అది కూడా ఫేక్ అంటారా అంటూ వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.

Also Read : సీట్ల పెంపు.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..?

వైసీపీ నేతల ఆరోపణలకు ఏపీ ఫ్యాక్స్ చెక్ క్లారిటీ ఇచ్చింది. “మార్కాపురం జిల్లా, రాయవరం సమీపంలో దురదృష్టవశాత్తూ జరిగిన రోడ్డు ప్రమాద స్థలానికి అంబులెన్సులు సకాలంలో రాలేదని కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఆప్తులైన వారిని కోల్పోయి ఎంతో ఆవేదన చెందుతున్న వారి మాటలను దురుద్దేశంతో కొందరు ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటంటే 26.03.2026న తెల్లవారుజామున 5.59 నిమిషాలకు ఈ ప్రమాదం గురించిన తొలి ఫోన్ కాల్ నెంబర్ 8688XXXXXX నుంచి వచ్చింది. ఆ తర్వాత 6.01కి 9848XXXXXX నెంబర్ నుంచి, 6.06 కి నెంబర్ 6281XXXXXX నుంచి అదే ప్రమాదంపై ఫోన్ కాల్ వచ్చింది. నెంబర్ 6281XXXXXX నుంచి మరో కాల్ కూడా వచ్చింది. తొలి కాల్ వచ్చిన 16 నిమిషాలలో మొదటి అంబులెన్సు ప్రమాద స్థలానికి చేరుకున్నది. 24వ నిమిషానికి రెండో అంబులెన్సు, 29వ నిమిషానికి మూడో అంబులెన్సు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. తొలి అంబులెన్సులో 10 మందిని, రెండో అంబులెన్సులో ఆరుగురిని, మూడో అంబులెన్సులో 8 మందిని మొత్తం 24 మంది క్షతగాత్రులకు ప్రాధమిక వైద్యం అందించి వారి ఆరోగ్యాన్ని స్ధిరపరచి మార్కాపూరం జిల్లా జనరల్ ఆసుపత్రికి చేర్చడం జరిగింది. అత్యంత సమర్ధంగా పని చేస్తున్న అంబులెన్సు వ్యవస్థ పై అపోహలు తలెత్తే విధంగా తప్పుడు ప్రచారాలు చేయడం వాంఛనీయం కాదు.” అని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కాల్ డేటా, కాల్ రికార్డు కూడా విడుదల చేశారు.

Also Read : బ్రేకింగ్: బయటపడ్డ అగ్ని ప్రమాదాల కుట్ర..! 

నిజానికి ప్రమాదం జరిగిన క్వారీ ప్రదేశంలో ఫోన్ సిగ్నల్స్ తక్కువగా ఉంటాయి. అది మార్కాపురం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. 108 సిబ్బంది ఫోన్ కాల్ అందుకున్న వెంటనే.. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలోని 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడ నుంచి ప్రమాద జరిగిన ప్రదేశం 15 కిలోమీటర్ల దూరం. మధ్యలో ప్రమాదకరమైన చెరువు కట్ట కూడా ఉంది. అంటే.. కనీసం 20 నిమిషాలు ప్రయాణం పడుతుంది. ఈ మధ్యలోనే పక్కనే ఉన్న తర్లుపాడు, పెద్దారవీడు అంబులెన్సులను కూడా ఘటనా స్థలికి పంపారు. వీటితో పాటు మేకలవారి పల్లె సమీపంలోని టోల్‌గేట్ వద్ద ఉన్న హైవే అంబులెన్స్ కూడా వచ్చింది. అయితే రహదారిపై ప్రమాదం జరగటంతో.. ఆ అంబులెన్స్ మార్కాపురం వెళ్లే అవకాశం లేదు. ఈ మధ్యలోనే బాధితులు, స్థానికులు పలుమార్లు 108కు ఫోన్ చేశారు. దీంతో 108 సకాలంలో స్పందించలేదు అనే పుకార్లు పుట్టించారు వైసీపీ నేతలు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ లిక్కర్ కేసు.....

ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ...

తిరుమలను తాకిన గ్యాస్...

పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్...

డిప్యూటీ స్పీకర్ రఘురామపై...

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఉద్రిక్తత...

బ్రేకింగ్: బయటపడ్డ అగ్ని...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గత కొద్దిరోజులుగా...

నిజామాబాద్ వేదికగా కవిత...

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం...

సీట్ల పెంపు.. ఎవరికి...

లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలన్న...

పోల్స్