ఇండియన్ బిగ్గెస్ట్ మాస్ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన కూలీ సినిమా కూడా నష్టాలే మిగులుస్తుందా..? అంటే అవుననే టాక్ వినపడుతోంది. కూలీ సినిమాతో బాక్సాఫీస్ పై దండ యాత్రకు దిగిన రజనీ కాంత్.. మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా తమిళ ఆడియన్స్ తో పాటుగా ఇతర భాషల్లో కూడా డిఫరెంట్ టాక్ తెచ్చుకుంది. ముందు నెగటివ్ టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్ గా కూడా ఈ సినిమాకు కాస్త మంచి టాక్ వచ్చింది.
Also Read : వార్ 2 వరల్డ్ వైడ్ లెక్క ఇదే.. మరీ ఇంత దారుణమా..?
కానీ క్రమంగా వసూళ్లు తగ్గుతూ రావడంతో బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టమే అంటున్నాయి నేషనల్ మీడియా వర్గాలు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ 2 సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాకు కాస్త క్రేజ్ పెరిగింది. రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ సినిమా, మొదటి రోజు భారీ వసూళ్లు సాధించింది. కానీ 8 వ రోజు మాత్రం 7 కోట్లు కూడా సాధించలేదు. ఇప్పటి వరకు ఇండియాలో 230 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఈ సినిమా. కూలీ రిలీజ్ అయిన మొదటి ఆదివారం 35.25 కోట్లు వసూలు చేసింది.
Also Read : ఆ విషయంలో టీడీపీకి వైసీపీ నేత మద్దతు..!
65 కోట్లతో బంపర్ ఓపెనింగ్ సాధించిన ఈ సినిమా 500 కోట్ల వరకు వెళ్తుందని అంచనా వేసారు. ఇది తమిళ సినిమాలలో రెండవ అత్యుత్తమ ఓపెనింగ్ కూడా. 66 కోట్లతో విజయ్ నటించిన లియో సినిమా ముందు ఉండగా, మొదటి రోజు బాలీవుడ్ సినిమా వార్ 2 సినిమాను కూడా డామినేట్ చేసింది. కాని అక్కడి నుంచి వసూళ్లు పడిపోయాయి. రజనీ కాంత్ కు స్క్రీన్ టైం లేకపోవడం, విలన్ తేలిపోవడం వంటివి సినిమాకు మైనస్ అయ్యాయి. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ నాగార్జున, బాలీవుడ్ సీనియర్ హీరో ఆమీర్ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే.