Saturday, March 14, 2026 10:35 PM
Saturday, March 14, 2026 10:35 PM

సీఎంఓ వర్సెస్ ఐఏఎస్.. రూల్స్ ప్రకారమే..!

సీఎంఓ ఐఏఎస్ అధికారికి ఓ శాఖాధిపతి షాక్ ఇచ్చిన అంశం ఇప్పుడు సచివాలయంలో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమైన ఫైళ్లు పరిష్కరించే ముందు, అప్పటి సీఎంఓ ఐఏఎస్ అధికారులతో అప్పటి శాఖాధిపతులైన సీనియర్ ఐఏఎస్ అధికారులే ముందుగా చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. అదే విధానాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలని కొంతమంది సీఎంఓ అధికారులు ఆర్డర్ వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఓ పధకం ప్రకారం ముందుకు వెళుతున్నారేమో అనే అనుమానం కూడా కలుగుతోంది.

Also read :ఎన్టీఆర్ ను అభిమానించే ఐపిఎస్ దొర ఇక లేరు..!

సచివాలయంలో కొంతమంది శాఖాధిపతులకు సీఎంఓ అధికారులంటే భయం, గౌరవం ఉండవచ్చు. చాలా మంది సీఎంఓతో పరిస్పరం సంప్రదింపులు జరుపుతూ సహకరించుకుంటారు కూడా. ఎక్కువ మంది ఐఏఎస్ అధికారులు సీఎంఓ ఐఏఎస్ అధికారులు చెప్పినట్లే చేస్తున్నారా..? అనే అనుమానం కూడా కలుగుతోంది. తాజాగా సచివాలయంలో జరిగిన ఘటన ఏమిటంటే.. నిజాయతీ పరుడైనా ఒక ఐఏఎస్ శాఖాధిపతికి, సీఎంఓ అధికారికి మధ్య జరిగిన చర్చ రసవత్తరంగా ముగిసిందట. అదేమిటంటే మీరు ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు నాతో సంప్రదించాలని.. సీఎంఓ అధికారి ఒకరు శాఖాధిపతి ఐఏఎస్ అధికారికి హుకుం జారిచేశారట. కానీ నిజాయతీ పరుడైనా ఆ ఐఏఎస్ అధికారి అదేమీ పట్టించుకోకుండా నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుని ఆ ఫైళ్లను సీఎంఓకు పంపినట్లు తెలుస్తోంది.

తాజాగా జరుగుతున్న కొత్త విధానం ఏమిటంటే.. శాఖాధిపతులు ఎవరైనా, ఫైళ్ల పై నిర్ణయం తీసుకునే ముందు, సీఎంఓ ఐఏఎస్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం సీఎంఓలో ఏర్పడ్డాయనే మాట బాగా వినిపిస్తోంది. మీరు నిర్ణయం తీసుకున్నాక, సంబంధించిన ఫైళ్లు సీఎంఓకు ఎలా పంపుతారు..? నాతో ముందుగా చర్చించాలి కదా అని సీఎంఓ ఐఏఎస్ అధికారి ఒకరు ఆ శాఖాధిపతి ఐఏఎస్ అధికారిని నిలదీశారంట. దీనికి సదరు శాఖాధిపతి కూడా ఘాటుగా బదులిచ్చినట్లు తెలుస్తోంది. “నేను ఏ నిర్ణయం తీసుకోవాలో మీకన్నా, నాకే ఎక్కువ తెలుసు.. నేను ఫైళ్ల పై నిర్ణయం తీసుకునే ముందు, మిమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం నాకు లేదు. నేను ఫైళ్ల పై నిర్ణయం తీసుకున్నాకే సీఎంఓకు ఫైళ్లు పంపుతాను తప్పా.. ముందుగా మీతో చర్చించాల్సిన అవసరం లేదు” అని సదరు శాఖాధిపతి తెగేసి చెప్పారట.

Also read :జంతు కొవ్వుపై సుప్రీం కీలక కామెంట్స్

దీంతో ఖంగు తిన్న సీఎంఓ ఐఏఎస్ అధికారి.. చేసేదేమి లేక సీఎంతో ఈ విషయం చర్చిస్తా.. అంటూ బెదిరించినట్లు తెలుస్తోంది. అయినా సరే, ఆ ఐఏఎస్ శాఖాధిపతి మాత్రం రూల్స్ ప్రకారమే వెళ్తా తప్ప.. తన పద్ధతి మార్చుకునేది లేదని చెప్పారట. దీనిని బట్టి, చాలా మంది శాఖాధిపతులు ముఖ్యమైన ఫైళ్ల పై నిర్ణయాలు తీసుకునే ముందు సీఎంఓ ఐఏఎస్ అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకొంటున్నారనే విషయం బయట పడినట్లు అయ్యింది. వైసీపీ ప్రభుత్వంలో ఆ విధమైన పద్ధతులు, ఒత్తిళ్లు ఉన్న మాట వాస్తవం. ప్రతి విషయం నాటి ప్రభుత్వ పెద్దలకు తెలియాల్సిందే. నాటి సీఎంఓ అనుమతి ఇచ్చిన తర్వాతే ఏ ఫైల్ అయినా సరే ముందుకు కదలాలి.. అనేది అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుత సీఎంఓ అధికారులు కూడా అదే విధానం పాటిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా ఒక శాఖాధిపతి సీఎంఓ అధికారి చెప్పుచేతల్లో కాకుండా.. నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బిజెపికి షాక్ ఇచ్చిన...

ప్రాంతీయంగా కొత్తగా పుట్టిన పార్టీలు అయినా,...

మీకోసమే ఇదంతా.. గిరిజనులతో...

ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజన...

వాళ్ల కంటే.. గూగుల్...

"మేము చేసింది చెప్పుకోలేక పోయాము.. చేసింది...

రాజకీయాల్లోకి ప్రీతి రెడ్డి.....

రాజకీయాల్లోకి మరో వారసురాలు రెడీ అయ్యారు....

ఎన్టీఆర్ ను అభిమానించే...

హెచ్ జే దొర.. ఈ తరానికి...

రాజకీయాల్లోకి అలేఖ్య రెడ్డి..!

అలేఖ్య రెడ్డి.. ఈ పేరు పెద్దగా...

పోల్స్