మావోయిస్ట్ ల విషయంలో తెలంగాణా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్ట్ లను జాతీయ స్థాయిలో ఎన్కౌంటర్ లు చేస్తున్న సమయంలో, తమ రాష్ట్ర బిడ్డలను కాపాడుకునేందుకు సిఎం రేవంత్ రెడ్డి.. ఎన్కౌంటర్ లను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఇటీవలి కాలంలో కీలక నేతలు తెలంగాణా ప్రాంతానికి వచ్చి లొంగిపోతున్నారు. ఇప్పుడు మరో కీలక నేత కూడా తెలంగాణా వచ్చి లొంగిపోయే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
Also Read : మళ్లీ వస్తే.. వాళ్లకు చెప్పు దెబ్బలే..!
పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణ రావు విషయంలో కూడా ఇదే వైఖరి ప్రదర్శిస్తోంది. ఆయన వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆయన నేపాల్ లో ఉన్నట్టు భావిస్తున్నారు. ఎస్ ఐ బీ అధికారులు ఆయనను వీలైనంత త్వరగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్దం చేసారు. వారం రోజుల్లో ఆయనను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆయన త్యాగాలను, ప్రజా జీవితాన్ని గౌరవించి తెలంగాణా రాష్ట్ర అతిధిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : మేడం గారు రెబల్.. అర్ధరాత్రి స్కూటిపై.. గంజాయి బ్యాచ్ కు చుక్కలు..!
ఆరేళ్ళ నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న గణపతి.. 70 ల్లో పార్టీలోకి వెళ్ళారు. సైన్స్ లో బీఎస్సీ చేసిన ఆయన.. బీఈడీ కూడా చేసారు. ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తూనే ఉద్యమంలోకి వెళ్ళారు. 2004 లో పీపుల్స్ వార్ గ్రూప్, మావోయిస్ట్ పార్టీలు కలిసిపోవడంతో అప్పుడు ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆయన భార్య, కుమారుడు లండన్ లో ఉంటున్నారు. 43 ఏళ్ళ నుంచి కుటుంబానికి గణపతి దూరంగానే ఉన్నారు. సిఎం రేవంత్ రెడ్డి సూచనలతో ఆయనను రాష్ట్రానికి తీసుకురావాలని భావిస్తున్నారు పోలీసులు.

