Friday, September 12, 2025 11:21 PM
Friday, September 12, 2025 11:21 PM
roots

భువనేశ్వరి అంటే చంద్రబాబుకు ఎంత ప్రేమో..!

నారా భువనేశ్వరి అంటే చంద్రబాబుకు ఎంత ప్రేమో మరోసారి రుజువు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భార్య భువనేశ్వరి కోసం చంద్రబాబు ఖరీదైన పట్టుచీరను బహుమతిగా ఇస్తున్నారు. అది కూడా చీర చూసిన వెంటనే ఎలాంటి బేరం చేయకుండా… ఈ చీర మేడం గారికి బాగుంటుంది సార్ అని చెప్పగానే.. “అవునా.. ఎంతమ్మా..” అని ప్రశ్నించారు చంద్రబాబు. వాళ్లు రేట్ చెప్పగానే.. సరే అనేసి డబ్బులు చెల్లించి చీర ప్యాక్ చేయించుకున్నారు. ఇదంతా ఏదో సీక్రెట్‌గా నాలుగు గోడల మధ్య జరిగిన విషయం కాదు. అందరి సమక్షంలోనే.. తన భార్య భువనేశ్వరి అంటే ఎంత ప్రేమో.. అందరికీ తెలియజేశారు చంద్రబాబు.

Also Read : కొడాలి నానీ అక్రమాలపై గురి పెట్టినట్టేనా…?

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. హెలికాఫ్టర్‌లో మార్కాపురం చేరుకున్న చంద్రబాబుకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత మార్కాపురం ప్రాంత ఆడపడుచు శ్రీ అల్లూరి పోలేరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ విజిట్ చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో చర్చించారు. అలాగే ఏపీలో మహిళా రైడర్స్‌కు సబ్సిడీపై బ్యాటరీ ఆటోలు, బైకులు అందించారు. ఔత్సాహిత మహిళా పారిశ్రామిక వేత్తలకు చేయూత కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న స్టాల్స్‌ను సందర్శించారు చంద్రబాబు.

Also Read : అఖిల్ కోసం.. పూరి స్టోరీ రెడీ.. నాగార్జున నమ్మకం అదే..?

డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన మొబైల్ శారీ స్టాల్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏమేమి అమ్ముతున్నారంటూ వారిని ప్రశ్నించారు. మహిళలు చూపించిన చీరల గురించి ఆరా తీశారు. మంగళగిరి కాటన్, ఉప్పాడ పట్టు, పెద్దాపురం సిల్క్ చీరలను పరిశీలించారు. అలాగే పొందూరు ఖద్దర్ పంచె, మంగళగిరి కాటన్ పంచెలను కూడా చూశారు. ఇంతలో ఓ మహిళ… “సార్.. మేడమ్ గారికి ఈ చీర బాగుంటుంది” అని సూచించారు. ఆ చీర చూసిన చంద్రబాబు.. ఇందులో వేరే కలర్స్ ఉన్నాయా అని అడిగారు. అలాగే ఇంకేమున్నాయి అని కూడా అడిగి తెలుసుకున్నారు. అందులో నుంచి పెద్దాపురం సిల్క్ చీరను ఎంపిక చేశారు. ఎంత అని అడిగి తెలుసుకున్నారు. రూ.25 వేలు అని చెప్పగానే… అసలు బేరం ఆడకుండా.. డబ్బులు చెల్లించారు. చీర ప్యాక్ చేసి ఇస్తారా అని అడిగి మరి ప్యాకింగ్ చేయించారు చంద్రబాబు. దీంతో అక్కడున్న వారంతా “మేడం అంటే సార్ కు ఎంత ఇష్టమో.. మంచి రంగుతో పాటు ఖరీదైన చీర కూడా సెలక్ట్ చేశారు” అంటూ తెగ సంబరపడిపోయారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్