ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డు విషయంలో అప్పుడు తప్పులు చేసారని ఇప్పుడు తాము పవిత్రత పెంచే విధంగా నాణ్యత పెంచే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. అన్నదానం విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేసారు చంద్రబాబు. ఇప్పుడు నాణ్యత పెంచి తిరుమల పవిత్రత విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు.
ఆ తర్వాత టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేసారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆల్ఫా కంపెనీ నుంచి ఆవు నెయ్యి దిగుమతి చేసుకున్నామని అన్నారు. వాస్తవానికి ఆల్ఫా కంపెనీ అనేది జంతువుల మాంసం విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీ. ఇక టీటీడీ బోర్డ్ మెంబర్ గా పని చేసిన రమణ కూడా చంద్రబాబు వ్యాఖ్యలను సమర్ధించారు. లడ్డు ప్రసాదం గట్టిగా మారిపోవడానికి కారణం జంతువుల కొవ్వు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. నెయ్యి కాకుండా బటర్ వాడారని ఆయన పేర్కొన్నారు. అందుకే నాణ్యత తగ్గిందని వ్యాఖ్యానించారు.
Read Also : అన్న సేవ నుంచి జన క్షేత్రానికి, మాజీ ఎమ్మెల్యేలు గుడ్ బై
అయితే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల వెనుక పక్కా ఆధారాలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. సున్నితమైన ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా మాట్లాడతారని… అలాంటి వ్యక్తి నుంచి కామెంట్స్ వచ్చాయంటే… అది కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన వ్యాఖ్యలు చేసారని… దీనిపై ఆధారాలను ప్రభుత్వం బయట పెట్టె అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక చంద్రబాబు వ్యాఖ్యల విషయంలో వైసీపీ లీడర్లు స్పందిస్తూ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ విషయం ఇప్పుడు ఈ విషయాన్ని జాతీయ మీడియా భారీగా కవర్ చేయడంతో జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపుతోంది. హిందుత్వ వాదులు దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.