Thursday, March 12, 2026 01:03 AM
Thursday, March 12, 2026 01:03 AM

రైతన్నలకు సిఎం చంద్రబాబు గుడ్ న్యూస్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సిఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమీక్షా సమావేశం మొదలైంది. గత మూడు నెలలుగా అమలు చేస్తోన్న కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి చేపట్టాల్సిన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో యాక్షన్ ప్లాన్ ను సిఎం చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయానికి ప్రోత్సాహమిచ్చేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తామంటూ చంద్రబాబు కీలక ప్రకటన చేసారు.

Also Read : ఏపీ పంచాయతీల్లో విప్లవాత్మక మార్పు

ఈ సందర్భంగా రైతులకు చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఈ నెల 13 తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని మూడో విడత అమలు చేస్తున్నాం అని చంద్రబాబు ప్రకటించారు. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా రైతుల ఖాతాల్లో మిగతా సొమ్ము వేస్తుందని చంద్రబాబు తెలిపారు. రైతు సంఘాలు, సాగునీటి సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలు ఇలా వేర్వేరు ప్రతినిధులు ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమాన్ని సమర్ధంగా తీసుకెళ్దామని మంత్రులకు, కలెక్టర్ లకు పిలుపునిచ్చారు చంద్రబాబు.

Also Read : సరికొత్త వ్యూహం.. తీవ్రత పెంచిన ఇరాన్..!

ఉగాది కానుకగా 2.50 లక్షల లబ్దిదారులకు సామూహిక గృహప్రవేశాలు చేయిస్తామని సిఎం చంద్రబాబు ప్రకటించారు. ఇంద్రధనస్సు’ పేరిట దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు అమలు చేస్తున్నామని.. గత పాలనలో ట్రూ-ఆప్ పేరిట విద్యుత్ చార్జీల భారం వేశారు.. తొలిసారి ట్రూ-డౌన్ చేశాం అని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ నెలాఖరు వరకూ 90 రోజుల పాటు నీటి సంరక్షణా చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు. నో సబ్ మెర్జెన్స్ విధానంలో కాలువల పూడికలు, చెరువుల లింకేజి లాంటి కార్యాచరణ చేపట్టాలని సూచించారు. భూగర్భ జలాలు పెరిగితే.. ప్రభుత్వం ఇస్తున్న రూ.14 వేల కోట్ల విద్యుత్ సబ్సీడీల భారం తగ్గుతుందన్నారు. 2027 మార్చి నాటికి భూవివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సీఎం.. ముహూర్తం...

​బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్...

బ్రేకింగ్: పాదయాత్రకు సిద్దమవుతోన్న...

తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని తిరిగి...

హైదరాబాద్ హాస్టల్స్ కష్టాలు.....

దేశ వ్యాప్తంగా ఎల్ పీ జీ...

పెంచలయ్య సరే.. మరి.....

తిరుమల పరకామణిలో బంగారం, వెండి అపహరణకు...

దానంకు క్లీన్ చిట్.....

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు...

ఏపీ క్యాబినెట్‌లో మార్పులు.....

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి...

పోల్స్