ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సిద్దమయ్యారు. త్వరలో అమరావతి పనులు ప్రారంభం కానున్న నేపధ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తిని రేపుతోంది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం సిఎం పలు మార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. అటు ప్రధాని కూడా సానుకూలంగా ఉండటంతో ఏపీకి పలు అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు నిధులు అడుగుతూ వస్తున్నారు. గతంలో కంటే ప్రస్తుతం బిజెపి అధిష్టానం చంద్రబాబుతో సన్నిహితంగా మేలుగుతోంది.
Also Read :జగన్ హెలికాప్టర్ దిగకుండా తిప్పి పంపుతా: పరిటాల సునీత
అటు కేంద్ర మంత్రుల నుంచి కూడా రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహకారం అందుతున్న నేపధ్యంలో.. అమరావతి పనులతో పాటుగా పోలవరం సహా జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్తరాంధ్ర, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలకు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నిధులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు చంద్రబాబు మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్దం కావడంతో ఏ ప్రకటన ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది.
Also Read :అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు.. అసలేం జరిగింది..?
అమరావతి పనుల ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని చంద్రబాబు భావిస్తున్నారు. భారీ ఎత్తున పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో విస్తారంగా ఉన్న ఆక్వా సమస్యలు కేంద్రం దృష్టికి చంద్రబాబు తీసుకు వెళ్ళే అవకాశం ఉంది. ట్రంప్, మోడీ మధ్య సత్సంబంధాలు ఉండడంతో ఆక్వా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. దీనితో పాటుగా ఏపీలో కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యాలయాలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయనున్నారు. దీనిపై కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ను చంద్రబాబు కలవనున్నారు.