ఏపీపై కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగం అందుకున్నాయి. ముఖ్యంగా రైల్వే లైన్ల విషయంలో కేంద్ర సర్కార్ దూకుడు ప్రదర్శిస్తోంది. రూ.1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనిపై ప్రధానమంత్రి మోదీ, రైల్వే మంత్రి వైష్ణవ్‌కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తూ, రైలు-రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు పడింది.
Also Read : బాగా బ్యాడ్ అయ్యా…కాస్త సరిచేయండి
తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే లైన్‌ను డబుల్ ట్రాక్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.1,332 కోట్లతో ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు నవ్యాంధ్ర అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలవనుందని రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ లైన్ డబ్లింగ్‌తో ఉత్తరాంధ్ర నుంచి తిరుపతికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత వేగవంతం, సౌకర్యవంతం కానుందని తెలిపారు. అదే విధంగా విద్యా, వైద్య అవసరాల కోసం వెల్లూరుకు వెళ్లే ప్రయాణికులకు ఇది గొప్ప వనరు కానుందన్నారు.
Also Read : బీ కేర్ ఫుల్.. జగన్‌కు మాస్ వార్నింగ్..!
ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరుకు రవాణా సాధ్యం కావడం ద్వారా పరిశ్రమల వృద్ధికీ ఇది తోడ్పడనుందని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్ సిమెంట్ మరియు స్టీల్ రంగాలకు మరింత చేయూతనివ్వబోతుందన్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభమైతే పలు ప్రాంతీయ అభివృద్ధి పనులు వేగం పుంచుకుంటాయని, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు డబుల్ ఇంజన్ పాలన విజయాన్ని ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడ్డారు.