Saturday, September 19, 2026 09:29 AM
Saturday, September 19, 2026 09:29 AM

ఆ ఒక్కడు ఎక్కడ..? మావోయిస్ట్ పార్టీ అగ్ర నేత కోసం కేంద్రం వేట..!

మావోయిస్టు పార్టీ రోజురోజుకీ క్షీణించిపోతుంది. దశాబ్దాలుగా అడవుల్లో పోరాడిన అన్నలు అలసిపోయి లొంగిపోతున్నారు. కొందరు ఎన్కౌంటర్లు పేరుతో ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు.. అరెస్టుల పేరుతో జైళ్లలో గడుపుతున్నారు. కేంద్ర కమిటీ సభ్యులు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, పార్టీ మిలటరీ విభాగం సభ్యులు ఒక్కొక్కరూ ప్రాణాలు కోల్పోతూ వస్తున్నారు. ఆశన్న, మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీ పూర్తిగా కుదేలు అయిపోయింది. ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ఉన్న ఏకైక నాయకుడు తిప్పిరి తిరుపతి.

Also Read : రాజు గారు.. కాస్త దూకుడు తగ్గించండి సార్..!

ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ.. ఇప్పుడు ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు అన్ని విధాలుగా కష్టపడుతున్నారు. అయితే ఆయనను ఎలాగైనా సరే పట్టుకోవాలని కేంద్ర భద్రత బలగాలు రచిస్తున్న ప్రణాళికలు ఫలితాన్ని ఇవ్వటం లేదు అనే వార్తలు వస్తున్నాయి. ఆశన్న, వేణుగోపాల్ లొంగిపోయిన తర్వాత.. వారిపై తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు దళిత నేతగా గుర్తింపు పొందిన ఆయన.. దళిత వర్గాలను పార్టీ వైపు నడపడంలో కీలక పోషించారు. దీనితో గణపతి, కట్టా రామచంద్రా రెడ్డి, బసవరాజ్ వంటి నేతలు తిరుపతికి ప్రాధాన్యత ఇచ్చారు.

Also Read : ఇంత ధీమాతో ఎలా ఉన్నారు ధర్మారెడ్డి గారు..?

అయితే ఇప్పుడు పార్టీకి కీలక నేతలు దూరం కావడంతో.. తిరుపతి ఆలోచన ఎలా ఉంది అనేది పోలీసు వర్గాలకు సైతం క్లారిటీ రావడం లేదు. ఇటీవల విజయవాడలో అరెస్టు చేసిన మావోయిస్టుల్లో అతని అనుచరులు, భద్రతా సిబ్బంది ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఆయనను కూడా పోలీసులు అరెస్టు చేసి ఉండవచ్చని భావించారు. కానీ మావోయిస్టు పార్టీ మాత్రం తమ వద్ద తిరుపతి క్షేమంగా ఉన్నారని తెలిపింది. ఇక మల్లా రాజిరెడ్డి పరిస్థితి కూడా అప్పట్లో క్లారిటీ రాలేదు. అయితే మాజీ మావోయిస్టుల వాదన ప్రకారం.. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ.. సాయుధ పోరాట విరమణకు అంగీకారం తెలపటం లేదనేది తెలుస్తోంది.

Also Read : నాపై కుట్ర జరుగుతోంది.. బాంబు పేల్చిన శివాజీ

తాజాగా ఆశన్న జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అంత తేలికగా తిరుపతి.. ఉద్యమాన్ని వదిలే నాయకుడు కాదన్నారు. పాలిటిబ్యూరోలో కూడా సాయుధ పోరాట విరమణలో గతంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేసుకున్నారు. అయితే దేవ్ జీ భద్రత సిబ్బంది పోలీసుల అదుపులో ఉండటంతో, అతని గురించిన సమాచారం దాదాపుగా పోలీసులకు తెలిసే ఉంటుంది అని అందరూ భావించారు. కానీ ఆయన దండకారణ్యం దాటి బయటకు వెళ్లిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత విదేశాల్లో ఉన్న గణపతిని తిరుపతి కలిసి ఉండవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తిరపతి ఎలా ఉంటారో కూడా పోలీసుల వద్ద ఫోటో కూడా లేదని సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

పోల్స్