Wednesday, February 4, 2026 10:49 AM
Wednesday, February 4, 2026 10:49 AM

ఏపీలో ఉప ఎన్నికలు ఖాయమా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయమా.. ఇప్పుడు ఇదే మాట పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది. నిజానికి ఎవరైనా శాసనసభ్యులు హఠాన్మరణం లేదా రాజీనామా చేస్తే తప్ప ఏపీలో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదు. కానీ ఇవేవీ లేకుండానే ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతాయని… అది కూడా ఏకంగా ఆరు నియోజకవర్గాలకు జరుగుతాయంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ 6 నియోజకవర్గాలు కూడా ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సేలు గెలిచిన నియోజకవర్గం అనే మాటా బాగా వినిపిస్తోంది. ఇప్పుడు ఇదే చర్చ.. అటు కూటమి ప్రభుత్వంలో, ఇటు వైసీపీలో జోరుగా జరుగుతోంది. ఉప ఎన్నిక.. అది కూడా ఒకేసారి ఆరు నియోజకవర్గాలు.. అది కూడా వైసీపీ గెలిచిన నియోజకవర్గాలు.. అనే మాట హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : డిప్యూటీ సీఎంగా నారా లోకేష్? వేణు స్వామి అంచనాలు కలకలం

2019 ఎన్నికల్లో 151 నియోజకవర్గాల్లో గెలిచిన వైసీపీ.. ఆ తర్వాత జరిగిన 2024 ఎన్నికల్లో మాత్రం ఘోరంగా ఓడిపోయింది. వై నాట్ 175 అన్ని ఎన్నికల ముందు గొప్పగా చెప్పిన జగన్ మోహన్ రెడ్డికి ఓటర్లు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 164 సీట్లు రాగా.. వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. జగన్‌ను ప్రతిపక్ష నేతగా కాకుండా ఒక ఎమ్మెల్యేగా చూస్తామని.. అసెంబ్లీలో వైసీపీ గెలిచిన స్థానాల ఆధారంగా ఆ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలో అంతే సమయం ఇస్తామని ఇప్పటికే సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు క్లారిటీ ఇచ్చారు. అంతే తప్ప.. సభ రూల్స్‌కు విరుద్ధంగా ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇచ్చేది లేదని తేల్చేశారు కూడా. అయితే తనకు సభలో తాను కోరుకున్నంత సేపు మాట్లాడే అవకాశం ఇవ్వాలని జగన్ సహా వైసీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఈ అంశంపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ సెక్రటరీ ఒక నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి ఏ సభ్యులు వస్తున్నారు.. ఎన్ని రోజులు సభకు హాజరయ్యారు.. ఎన్ని ప్రశ్నలు వేశారు.. ఎన్నిజవాబులు వచ్చాయనే అంశాలపై పూర్తిస్థాయి నివేదిక సభాపతికి అందించినట్లు తెలుస్తోంది. ఇందులో వైసీపీకి చెందిన ఆరుగురు సభ్యులపై అనర్హత వేటు వేయవచ్చు అని తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రతి సభ్యుడు సభకు హాజరవ్వటం అవ్వాలి. అలాగే 60 రోజుల పాటు సభకు దూరంగా ఉంటే.. వారిపై అనర్హత వేటు వేయవచ్చు అనేది నియమావళి. ఇందులో భాగంగా సభ్యుల హాజరు పట్టినను పరిశీలించారు. వైసీపీకి చెందిన సభ్యులు ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే సభకు హాజరయ్యారు. ఒకటి ప్రమాణస్వీకరం, రెండోది 2025 ఏడాది బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ తొలిరోజు.. అది కూడా గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హజరయ్యారు. అది కూడా 11 నిమిషాల పాటే సభలో ఉన్నారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. దీనిపై అప్పట్లోనే అయ్యన్నపాత్రడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగం రోజును లెక్కలోకి తీసుకునేది లేదన్నారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళుతున్నారు.. వీళ్లు అసెంబ్లీకి హాజరైనట్లు కాదన్నారు.

Also Read : ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా..? సిఎం సీరియస్..!

అటు స్పీకర్ ప్రకటన, ఇటు అసెంబ్లీ సెక్రటరీ నివేదిక ఆధారంగా వైసీపీలో ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతుందనే మాట బాగా వినిపిస్తోంది. అదే జరిగితే.. ప్రస్తుతమున్న 11 మంది ఎమ్మెల్యేల సంఖ్య 5కు పడిపోతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అని చెబుతున్నారు. అయితే అనర్హత నిర్ణయం బడ్జెట్ సమావేశాలకు ముందే తీసుకుంటారా.. లేక వైసీపీ సభ్యులకు బడ్జెట్ సమావేశాల వరకు అవకాశం ఇస్తారా..? అనే చర్చ జరుగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్