ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత క్రికెట్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అప్పటి బీసీసీ కార్యదర్శి జై షా మాట్లాడుతూ ఛాంపియన్ ట్రోఫీ, అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కు టీమిండియా అడుగుపెట్టలేకపోయింది. ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ ఎలాగైనా సరే గెలవాలని భారత క్రికెట్ జట్టు పట్టుదలగా ఉంది. అయితే ఈ తరుణంలో భారత్ బౌలింగ్ విభాగానికి ఎదురు దెబ్బ తగిలింది.
Also Read : గతం మర్చిపోయి నోరుజారిన కేసీఆర్
టీమిండియా కీలక ఆటగాడు బౌలర్ జస్ప్రిత్ బూమ్రా గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. దీనితో అతని స్థానంలో యువ బౌలర్ హర్షిత్ రానా ను తుది జట్టులోకి తీసుకోనున్నారు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన రెండు వన్డే మ్యాచ్ లలో ప్రభావం చూపించిన ఈ యువ బౌలర్.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ విధంగా ప్రభావం చూపిస్తాడని దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. బౌలింగ్ లో వేగం ఉన్నా సరే పరుగులు ధారాళంగా ఇస్తాడు అనే పేరు కూడా ఉంది. అయితే కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో రానాపై కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే హెడ్ కోచ్ గంభీర్ ఎంతవరకు నమ్మకం ఉంచుతారు అనేది చెప్పలేని పరిస్థితి.
Also Read : అగ్ని ప్రమాదంపై వైసీపీ కామెడి ప్రకటన..!
ఇక మరో యువ బౌలర్ అర్షదీప్ సింగ్ ను తుది జట్టులోకి తీసుకుంటారా లేదా అనేదానిపై క్లారిటీ రావటం లేదు. అయితే లెఫ్ట్ హ్యాండ్ పేసర్ ఉంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ లో అతనికి అవకాశం కల్పించలేదు. భారత బ్యాటింగ్ విభాగం విషయంలో ఇబ్బందులు లేకపోయినా.. బౌలింగ్ విభాగం విషయంలో మాత్రం ఒక ప్రణాళిక లేకుండా వెళుతున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఓటమికి ఇదే కారణం.
Also Read : కుంకీ ఏనుగులు కోసం రంగంలోకి సీఎం..!
మరి ఛాంపియన్స్ ట్రోఫీలో అయినా సరే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారా అనేది చూడాలి. 2023 వన్డే ప్రపంచకప్ విషయంలో జరిగిన తప్పులు ఇప్పుడు జరగకుండా చూడాలని, బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికే మహమ్మద్ షమీ పర్వాలేదనిపిస్తున్నాడు. దాదాపు 16 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడిన షమీ నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను రాణిస్తే భారత్ కు బౌలింగ్ కష్టాలు తప్పినట్లే. బూమ్రా లేని లోటు షమీ తీర్చినట్లే.