Friday, September 12, 2025 10:29 PM
Friday, September 12, 2025 10:29 PM
roots

మీకు ఇదేం పిచ్చి రా బాబు..!

నా దారి రహదారి.. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే.. అనేది నరసింహ సినిమాలో రజనీకాంత్ చెప్పే డైలాగ్. ఇది చాలా ఫేమస్ డైలాగ్ కూడా. దీనిని చాలా మంది నేతలు ఇమిటేట్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో మాత్రం.. నువ్వు నడిచే దారి బాగుంటే చాలు.. అదే దారిలో నేను కూడా నడుస్తా అని నేతలంటున్నారు. ఏపీలో వైసీపీ కార్యకర్తలు చేసిన పనికి విపరీతమైన పబ్లిసిటీ రావటంతో.. తెలంగాణ నేతలు కూడా ఇదే బాగుందని పాటిస్తున్నారు.

Also Read : జగన్ పై క్యాడర్ లో పెరుగుతోన్న కోపం.. కారణం ఇదే

పుష్పా సినిమా వచ్చి ఇప్పటికే ఆరు నెలలు దాటింది. కానీ ఇప్పటికీ ఆ సినిమాలో డైలాగులు బాగా పాపులర్‌గా వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం పల్నాడు జిల్లాలో జగన్ పర్యటించిన సమయంలో రవితేజ అనే వైసీపీ కార్యకర్త పట్టుకున్న పోస్టర్ పెద్ద వివాదాస్పదంగా మారింది. 2029లో వైసీపీ వచ్చిన వెంటనే.. గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్పా రప్తా నరుకుతాం ఒక్కొక్కడిని.. పోస్టర్ పట్టుకున్నాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీనిపై జగన్ కూడా మంచిదేగా అని వ్యాఖ్యానించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. అంటే హత్యా రాజకీయాలను జగన్ ఎంకరేజ్ చేస్తున్నారా అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

Also Read : పంత్ మరో అదిరిపోయే రికార్డ్..!

రప్పా రప్పా డైలాగ్ వార్ ఏపీలో ఓ రేంజ్‌లో ఉంది. దీంతో ఇదే బాగుందని తెలంగాణ నేతలు కూడా భావించినట్లున్నారు. అందుకే ఊచకోతకు హెచ్చరికలా ఉన్న రప్పా రప్పా డైలాగ్‌ను బీఆర్ఎస్ నేతలు కూడా మొదలు పెట్టారు. అయితే ఏపీలో అయిన కేసులను దృష్టిలో పెట్టుకుని.. కాస్త జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. నరుకుతాం, చంపుతాం అనే పదాలు లేకుండా.. 2028లో రప్ప రప్ప.. 3.0 లోడింగ్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫోటో పెట్టారు.

Also Read : యోగాంధ్ర టార్గెట్ అదే.. బాబు రీచ్ అవుతారా..?

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రైతులు రైతు భరోసా ఇవ్వాలంటూ జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మాజీ మంత్రులు హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మానిక్ రావు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీలోనే రప్పా రప్పా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఓ వైపు ఏపీలో పెద్ద దుమారం రేపుతున్న రప్పా రప్పా డైలాగ్.. ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలైంది. దీంతో నెటిజన్లు మీకు ఇదేం పిచ్చి రా బాబు.. ఇలా నరుకుతాం.. చంపుతాం అని పోస్టర్లు వేస్తున్నారు.. అంటూ సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్