తెలంగాణా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు కాస్త హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలపడే ప్రయత్నం చేస్తున్న నేపధ్యంలో కొందరు నేతలు బీఆర్ఎస్ నుంచి సొంత గూటికి వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి ఈ విషయంలో క్లారిటీ ఇవ్వగా… మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా పార్టీ మారే విషయంలో సంకేతాలు ఇచ్చేసారు. అయితే వీళ్ళు ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది క్లారిటీ రావడం లేదు.
త్వరలోనే బహిరంగ సభ ఏర్పాటు చేస్తారని, వరంగల్ లేదా హైదరాబాద్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. కాని ఇప్పుడు సైలెంట్ గానే కొందరు జాయిన్ కావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దీపావళి లోపు టీడీపీలో జాయిన్ అయ్యే ఆలోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అమరావతి లేదా హైదరాబాద్ లో చంద్రబాబులో సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉందని సమాచారం. తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు కండువా కప్పుకోనున్నారు.
Also Read : గోడ దూకారు.. కనుమరుగయ్యారు..!
నారా రోహిత్ నిశ్చితార్ధం సందర్భంగా చంద్రబాబుని కలిసేందుకు మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేసారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు హైదరాబాద్ రావడం సాధ్యం కాకుంటే అమరావతిలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయనకు టీడీపీ నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. దీనిపై త్వరలోనే సన్నిహితులతో కూడా ఆయన సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.