Friday, September 12, 2025 09:21 PM
Friday, September 12, 2025 09:21 PM
roots

లొంగిపోయిన బోరుగడ్డ.. పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఇదే

గత కొన్ని రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోయాడు. తన తల్లికి అనారోగ్యం పేరుతో తప్పుడు సర్టిఫికెట్ సృష్టించి కోర్టుకు సమర్పించిన బోరుగడ్డ అనిల్.. ఇన్ని రోజులు మధ్యంతర బెయిల్ పై బయట తిరిగాడు. అయితే అతని తల్లి వద్దకు బోరుగడ్డ అనిల్ వెళ్లలేదని, చెన్నై అపోలో ఆసుపత్రి పరిసరాలలో కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ తిరగలేదని పోలీసులు సమాచారం సేకరించారు.

Also Read : ఐపిఎల్ కు కేంద్రం షాక్.. ఆ ప్రకటనలు అన్నీ బ్యాన్

వాస్తవానికి మంగళవారం సాయంత్రం బోరుగడ్డ అనిల్ కుమార్.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాల్సి ఉంది. కానీ 12 గంటల ఆలస్యంగా వెళ్ళాడు. ఇక కోర్టు ఇచ్చిన గడువులోగా రాకపోవడంతో పోలీసులకు జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఫిర్యాదు చేశారు. 12 గంటలు ఆలస్యంగా సెంట్రల్ జైలుకు వచ్చిన అనిల్ పై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే హైకోర్టుకు నివేదిక కూడా సమర్పించారు. ఇక తనపై మద్యంతర బెయిల్ మరోసారి పొడిగించాలని బోరుగడ్డ అనిల్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు విచారణ జరిపింది.

Also Read : పార్టీ క్యాడర్ ను ముంచుతున్న ఎమ్మెల్యే…?

అతనికి మరోసారి బెయిల్ పొడిగించేందుకు కోర్టు నిరాకరించింది. తక్షణమే లొంగిపోవాలని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అనిల్ కుమార్ తీసుకున్న ఫేక్ సర్టిఫికెట్ ఫోర్జరీ చేసింది అని గుర్తించారు అధికారులు. దీనిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బోరుగడ్డ అనిల్ కుమార్ పై కోర్టు దిక్కరణ నేరం కింద కూడా పరిగణించే అవకాశాలున్నాయి. రెండుసార్లు బెయిల్ తీసుకుని బయటికి వెళ్లినా సరే.. మీడియాకు సమాచారం ఇవ్వలేదు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై జైలు అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్