బాహుబలి సినిమా తర్వాతి నుంచి బాలీవుడ్.. రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలో కాస్త అక్కసు వెళ్లగక్కుతూ వచ్చిన విషయం అందరికి క్లారిటీ ఉంది. ఆదిపురుష్ సినిమా విషయంలో ఫ్యాన్స్ కూడా ఎన్నో విమర్శలు చేసారు. ప్రభాస్ రేంజ్ తగ్గించాలనే ఉద్దేశంతోనే ఆ సినిమా చేసారనే కోపం ఫ్యాన్స్ లో ఇప్పటికీ ఉంది. అందుకే ప్రభాస్.. ఆ తర్వాతి నుంచి నార్త్ ఇండియా డైరెక్టర్ ల విషయంలో పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. కల్కీ సినిమా తర్వాత ఎక్కువగా ప్రభాస్ పై బాలీవుడ్ ఏడవడం మొదలుపెట్టింది.
Also Read : లిక్కర్ స్కామ్ ని మించిన మరో కుంభకోణం బయటపెట్టిన ఏబివి
ప్రభాస్ ఫ్లాప్ సినిమాలకు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలకు ఒకే విధంగా కలెక్షన్ లు ఉండటం బాలీవుడ్ జీర్ణించుకోలేదు. ఇక ఇప్పుడు కల్కీ పార్ట్ 2 నుంచి దీపికా పదుకొనేని పక్కన పెట్టడంపై బాలీవుడ్ లో ఫ్యాన్స్, అక్కడి మీడియా ప్రభాస్ ను టార్గెట్ చేస్తోంది. మిర్చీ సినిమాతో ప్రభాస్ 2013 లో 75 కోట్లు వసూలు చేస్తే, దీపిక ఏ జవాని హై దీవాని సినిమాతో 250 కోట్లు వసూలు చేసిందని, కల్కీ సినిమాలో దీపికను హైలెట్ చేయడం ప్రభాస్ కు ఇష్టం లేదని, అందుకే ఆమెను పక్కన పెట్టాలని డైరెక్టర్ పై ఒత్తిడి తెచ్చాడని అక్కడి ఫ్యాన్స్ కొన్ని మీమ్స్ వైరల్ చేస్తున్నారు.
Also Read : మర్రి రాకతో గుబులు మొదలైందా..?
ఇక అమితాబ్ ఉండటం కూడా ప్రభాస్ కు ఇష్టం లేదని, అమితాబ్ ను కూడా పక్కన పెడతారని ఓ గాసిప్ వైరల్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ కు యాక్షన్ రాదని, పీఆర్ టీంతో అతనికి హైప్ ఇస్తున్నారు అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ లో చిన్న హీరోలు కూడా ప్రభాస్ కంటే బాగా యాక్ట్ చేస్తారని, యాక్టింగ్ రాని ప్రభాస్ ను ఎలివేషన్ సీన్స్ తో డైరెక్టర్ లు లేపుతున్నారని విమర్శిస్తున్నారు. కాగా ఇటీవల కల్కీ పార్ట్ 2 నుంచి దీపికను డైరెక్టర్ పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.