వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. వైసీపీ హయాంలో చెలరేగిపోయిన కొంతమంది నాయకులు ఇప్పుడు వేరే దారులు కూడా వెతుక్కుంటున్నారు. అప్పట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన నాయకులు ఇప్పుడు కేసుల నుంచి బయటకు రావడం కోసం అవకాశాలను వెతుక్కోవటం మొదలుపెట్టారు. తాజాగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలు కనబడుతున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి వైసిపి హయాంలో బూతులతో చెలరేగిపోయిన నాయకుల్లో బొల్లా బ్రహ్మనాయుడు కూడా ఒకరు. ఆయన మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.
Also Read : అసలు జగన్ కు ఆ అర్హత ఉందా..?
ఇక బొల్లా విషయంలో నియోజకవర్గ స్థాయి నాయకత్వం కూడా సీరియస్ గానే ఉంది అనే ప్రచారం ఈమధ్య మొదలైంది. పార్టీలో ఆయన నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎవరినీ పైకి రానీయడం లేదని కొంతమంది స్థానిక నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరిస్థితులను గమనిస్తున్న బ్రహ్మనాయుడు ఇక వైసిపిలో ఉండటం కరెక్ట్ కాదు అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి తోడు వినుకొండ నియోజకవర్గంలో ఆయన చేసిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు ఈ మధ్య వార్తలు వస్తున్నాయి.
Also Read : వంశీ కి ఊహించని షాక్ ఇచ్చిన హైకోర్టు
దీనితో ముందు జాగ్రత్తగా బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా వైసిపి కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిని వినుకొండ వైసీపీ నాయకులు కలిశారు. బొల్లా నాయకత్వంలో తాము పని చేయలేమని మరో నాయకుడిని ఇన్చార్జిగా నియమించాలని కోరారు. అయితే తన వాదనను వైసీపీ అధిష్టానం పట్టించుకోవడంలేదని బొల్లా బ్రహ్మనాయుడు ఆగ్రహంగా ఉన్నారు. ఇక నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై కూడా ఆయన పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు. దీనికి తోడు ప్రకాశం జిల్లా జనసేన కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే జనసేన అధిష్టానంతో శ్రీనివాసరెడ్డి క్లారిటీ తీసుకున్నారని త్వరలోనే బొల్లా బ్రహ్మనాయుడు జనసేనకు జై కొట్టే అవకాశాలు ఉండొచ్చని ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రచారం మొదలైంది.