Thursday, February 26, 2026 09:51 PM
Thursday, February 26, 2026 09:51 PM

టార్గెట్ జనసేనాని అంటున్న బొలిశెట్టి..!

ఏపీలో రెండు వరుస ఘటనలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. ఇందులో ఒకటి రాజమండ్రి కల్తీ పాల ఘటన అయితే.. మరొకటి శ్రీకాకుళం పట్టణంలో డయేరియా వైరస్. రాజమండ్రి ఘటనలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు.. శ్రీకాకుళం డయేరియా ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ.. నలుగురు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రెండు ఘటనల్లో రాజమండ్రి కల్తీ పాలు పూర్తిగా ప్రైవేటు వ్యక్తి చేసిన తప్పిదం కాగా.. శ్రీకాకుళం మాత్రం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అని స్పష్టమవుతోంది. అయితే 11 ఏళ్లుగా డెయిరీ పేరుతో ఓ వ్యక్తి పాల వ్యాపారం చేస్తున్నప్పటికీ.. అధికారులు మాత్రం కనీస తనిఖీలు చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజమండ్రి, శ్రీకాకుళం ఘటనలపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. రాజమండ్రి కల్తీ పాల ఘటనకు కారణమైన గణేష్ అనే వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే శ్రీకాకుళం మునిసిపల్ కమిషనర్‌పైప సస్పెన్షన్ వేటు పడింది. రాజమండ్రి, శ్రీకాకుళంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం కూడా అందించింది. బాధితులకు అయ్యే వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోంది. రెండు చోట్ల స్థానిక ప్రజా ప్రతినిధులు స్వయంగా పర్యవేక్షిస్తూ.. పరిస్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు.

Also Read : పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ రెడీ చేస్తున్న డైరెక్టర్లు..!

అయితే ఈ రెండు ఘటనలకు కారణాలపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించిన బొలిశెట్టి సత్యనారాయణ ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. “రాజమండ్రి మరణాలకు అసలు కారణం పాలా లేక నీళ్ళా..? నిజానిజాలు నిష్పక్షపాతంగా తేలాల్సిన అవసరం ఉంది.” అంటూ ప్రశ్నించారు.
​రాజమండ్రిలో కల్తీ వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం. కానీ, కనీసం పరీక్షా నివేదికలు కూడా రాక ముందే అవి కేవలం పాల వల్ల జరిగిన మరణాలని నిర్ధారించి ముగింపు పలకడం సరికాదు.. అంటూ విమర్శించారు.

“​రాజమండ్రి మాత్రమే కాదు, రాష్ట్రమంతటా సంభవిస్తున్న అనేక మరణాలకు అసలు కారణం జల, వాయు, భూగర్భ కాలుష్యం! దీనిపై పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రతి చోటా ప్రజలను భాగస్వామ్యం చేయాలి. కేవలం రివ్యూలతోనో లేదా అసెంబ్లీలో మాట్లాడితేనో సమస్య సద్దుమణుగదు. కాలుష్య నియంత్రణ మండలి క్షేత్ర స్థాయిలో తన బాధ్యతను నిర్వర్తించేలా చేయాలి. వారి పనితీరు, తీసుకునే కఠిన చర్యలు ప్రజలకు ప్రత్యక్షంగా కనబడాలి.” అంటూ వ్యాఖ్యానించారు. ​నాలుగేళ్ల క్రితమే ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ డాక్టర్ రాజేంద్ర సింగ్‌తో కలిసి ఏపీ పేపర్ మిల్స్, రాజమండ్రి మున్సిపాలిటీ వ్యర్థాలు, ఆంధ్రా షుగర్స్ విడుదల చేస్తున్న కాలుష్యం గోదావరిని ఎలా విషతుల్యం చేస్తున్నాయో చూసి వాటిని వివరిస్తూ ప్రభుత్వాలకు తానే స్వయంగా విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. ఆ విజ్ఞప్తులపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటి..? ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ రాజమండ్రి వద్ద అఖండ గోదావరి నదీ కాలుష్యంపై ప్రస్తావనను శాసనసభలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి లేవనెత్తారు అంటేనే ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడుతోందంటూ సూటిగా ప్రశ్నించారు.

Also Read : పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ రెడీ చేస్తున్న డైరెక్టర్లు..!

​ప్రభుత్వం కేవలం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని.. కాలుష్యాన్ని శాశ్వతంగా అరికట్టడానికి ఒక స్పష్టమైన కాలపరిమితితో కూడిన ప్రణాళికను #Time-boundplan యుద్ధ ప్రాతిపదికన ప్రకటించాలని డిమాండ్ చేశారు. ​ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ మండలి మేల్కొని.. కేవలం కార్యాలయాలకు పరిమితమైన తప్పుడు ల్యాబ్ రిపోర్టులపై కాకుండా, క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకొని కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి మరణాలు సంభవిస్తూనే ఉంటాయి.. ప్రభుత్వం పరిహారాలు చెల్లిస్తూనే ఉండాల్సి వస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి అలసత్వం వహిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే కాలుష్యం గుర్తుకు వచ్చిందా అని బొలిశెట్టిపై విమర్శలు చేస్తున్నారు. అయితే వీటికి బొలిశెట్టి ఘాటుగా బదులిస్తున్నారు. తాను ఇప్పటికీ జనసేనలోనే ఉన్నాను.. ఉంటాను అని స్పష్టం చేశారు. రాజీనామా కేవలం పదవులకు మాత్రమే అని.. అది కూడా కోర్టులో ప్రభుత్వంపై వేసిన కాలుష్యం తీర్పు వచ్చే వరకు మాత్రమే అని బొలిశెట్టి జవాబిచ్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నా భర్తను పరిచయం...

విజయ్‌ దేవరకొండ, రష్మిక మూడు ముళ్ల...

పెద్దల సభ కు...

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ...

తప్పు ఒకరిది.. కోర్టు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు...

మావో బాస్ కు...

మావోయిస్ట్ ల విషయంలో తెలంగాణా ప్రభుత్వం...

మళ్లీ వస్తే.. వాళ్లకు...

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి.....

మేడం గారు రెబల్.....

సాధారణంగా మహిళలు అనగానే రాత్రి సమయాల్లో...

పోల్స్