Monday, October 27, 2025 10:34 PM
Monday, October 27, 2025 10:34 PM
roots

సాక్షిగా బండి సంజయ్.. ఫోన్ ట్యాపింగ్ లో బిజెపి ఎంటర్ అయినట్టే..?

తెలంగాణా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు సంచలన మలుపుల దిశగా అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షాల ఫోన్ లను ట్యాపింగ్ చేసారనే ఆరోపణలు తీవ్రంగా రావడం, గత మూడు నాలుగు రోజుల నుంచి సంచలన విషయాలు బయటకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక తాజాగా ఈ వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకునే సంకేతాలు కనపడుతున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి నోటీసులిచ్చేందుకు సిట్ సిద్దమైంది.

Also Read : ఏపీలో టాపిక్ డైవర్ట్ పాలిటిక్స్..!

బండి సంజయ్ కు ఫోన్ చేసిన అధికారులు మీ ఫోన్ ట్యాప్ అయ్యిందని వివరించారు. ఇక విచారణకు సిద్ధంగా ఉండాలని కోరిన పోలీసులు.. కేంద్ర మంత్రి వాంగ్మూలం తీసుకునేందుకు సమయం కోరారు. షెడ్యూల్ చూసుకుని టైం చెబుతానని బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. రేపో మాపో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలుత తెరపైకి తీసుకొచ్చింది బండి సంజయ్ నే కావడం విశేషం. కేసీఆర్ పాలనలో ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ పలుమార్లు ఆరోపించారు బండి సంజయ్.

Also Read : యోగాంధ్ర టార్గెట్ అదే.. బాబు రీచ్ అవుతారా..?

కుటుంబ సభ్యుల, వ్యక్తిగత సిబ్బంది, ప్రదాన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేశారని సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అనేక ఉద్యమాలు, ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ కార్యక్రమాలను భగ్నం చేసేందుకు బండి సంజయ్ తోపాటు కుటుంబ సభ్యుల, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను ట్యాపింగ్ చేసింది గత ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం తెలుసుకుని అర్ధరాత్రి సంజయ్ నివాసంపై దాడి చేసి టెన్త్ పేపర్ లీక్ పేరుతో అరెస్ట్ చేసారు.

Also Read : అలా చేస్తే తొలి టెస్టు మనదే

కరీంనగర్ ఎంపీ ఆఫీసులో 317 జీవో సవరణ దీక్ష జరగకుండా నిలువరించేందుకు శతవిధాలా ప్రయత్నించి భంగపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఫోన్ ట్యాప్ తో తనను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని పలుమార్లు సభల్లో, మీడియా వేదికల ద్వారా బండి సంజయ్ ఆరోపించారు. భార్యాభర్తల సంభాషణలను కూడా ట్యాప్ చేసి నీచానికి ఒడిగట్టిందని సంజయ్ ఆరోపణలు చేసారు. బండి సంజయ్ చెప్పిందంతా నిజమేనని సిట్ వర్గాలు అంటున్నాయి. వందలాది మంది ఫోన్లు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిర్దారణకు వచ్చారు. సాక్షిగా బండి సంజయ్ వాంగ్మూలం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. జాతీయ దర్యాప్తు సంస్థ సిబిఐ తో కేంద్రం విచారణ చేయించే అవకాశం కనపడుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్