Saturday, September 13, 2025 01:23 AM
Saturday, September 13, 2025 01:23 AM
roots

ఐపీఎస్ సంజయ్‌కి సుప్రీంకోర్టులో భారీ షాక్

అగ్నిమాపకశాఖ డీజీగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ సంజయ్‌కి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సంజయ్ ముందస్తు బెయిల్‌ను రద్దు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం నేడు సంచలన తీర్పు వెలువరించింది. మూడు వారాల్లోగా కింది కోర్టులో లొంగిపోవాలని ఐపీఎస్ సంజయ్‌ని ఆదేశించింది. అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారంటూ సంజయ్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో ఐపీఎస్ సంజయ్‌కి బెయిల్ రద్దవడంతో పాటు, చట్టానికి లొంగిపోయి విచారణ ఎదుర్కోవాల్సి వుంటుంది.

Also Read : రిలీజ్ కు ముందే వార్ 2 భారీ కలెక్షన్స్

ముందు ఏం జరిగింది? సుప్రీంకోర్టు షాకింగ్ వ్యాఖ్యలు!

ఇటీవలే బెయిళ్ళ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు స్పందనగా, “సారీ టు ది స్టేట్ ఆఫ్ అఫైర్స్” అంటూ వ్యాఖ్యానించిన ఒక హైకోర్టు న్యాయమూర్తి గతంలో ఇచ్చిన 49 పేజీల ముందస్తు బెయిల్ తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నప్పుడు, హైకోర్టు బెయిల్ తీర్పును పరిశీలించి కీలక వ్యాఖ్యలు చేసింది. “ఇది ముందస్తు బెయిల్ విచారణలా కాకుండా, ఏపీ హైకోర్టు కేసు విచారణ జరిపినట్లు ఉంది,” “మినీ ట్రయల్ జరిగినట్లుగా ఉంది” అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. ముందస్తు బెయిల్ పిటిషన్లలో సాధారణంగా కేసు వివరాల్లోకి ఇంత లోతుగా వెళ్లరని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ స్థాయిలో 49 పేజీల తీర్పు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

అప్పట్లో న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ

సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే న్యాయవాద వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన ఈ అసంతృప్తి, రాష్ట్రంలోని న్యాయ, పాలనా వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న చర్చకు తెరలేపింది. ఒక ముందస్తు బెయిల్ కేసులో 49 పేజీల తీర్పు, మినీ ట్రయల్ జరిగినట్లుగా ఉందన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు రాష్ట్ర న్యాయవ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తాయి. ఇది రాష్ట్రంలోని ఉన్నత న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు నుండి వచ్చిన ఒక బలమైన హెచ్చరికనా అన్న కోణంలోనూ చర్చ జరిగింది.

Also Read : జగన్‌కు వాళ్లు మాత్రమే సన్నిహితులా..?

తాజాగా బెయిల్‌ను రద్దు చేయడం ద్వారా, సుప్రీంకోర్టు తన వైఖరిని మరింత స్పష్టం చేసింది. ఈ పరిణామం ఐపీఎస్ సంజయ్‌తో పాటు, రాష్ట్ర న్యాయ వ్యవస్థకు కూడా ఒక కీలకమైన ‘సెట్ బ్యాక్’గా భావించబడుతోంది. సారీ టు ది స్టేట్ ఆఫ్ బెయిల్ అఫైర్స్ అని సామాన్యులు అనుకొనే పరిస్థితి స్వయంకృతం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్