Tuesday, February 10, 2026 04:06 PM
Tuesday, February 10, 2026 04:06 PM

మీకు దండం.. భారత్ తో ఆడండి.. బంగ్లాదేశ్ షాకింగ్ రిక్వెస్ట్..!

ముస్తాఫిజుర్ రహమాన్ ను ఐపిఎల్ నుంచి రిలీజ్ చేయడం ఏమో గాని.. ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం ఆసక్తిని రేపుతున్నాయి. టి20 వరల్డ్ కప్ నుంచి బంగ్లా బోర్డు తప్పుకోవడం.. ఆ తర్వాత భారత్ తో ఆడేది లేదని పాక్ క్రికెట్ బోర్డు షాక్ ఇవ్వడం.. ఇప్పుడు మళ్ళీ డ్రామాలు ఆడుతూ భారత్ తో మ్యాచ్ కు ఓకే చెప్పడం.. అన్నీ సినీ ఫక్కీలోనే కనపడుతున్నాయి. మూడు డిమాండ్ లు అంటూ హడావుడి చేసిన పాక్ బోర్డు.. చివరకు ఐసీసీ నో చెప్పడంతో సైలెంట్ అయిపొయింది.

Also Read : పసి కూనలు కాదు.. డైనమైట్స్..!

ఇక తాజాగా ఓ పరిణామం చోటు చేసుకుంది. పాక్ క్రికెట్ బోర్డుకు బంగ్లాదేశ్ ఓ లేఖ రాసింది. ఫిబ్రవరి 15 ఆదివారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో జరగనున్న టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాల్గొనాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పాకిస్థాన్‌ ను రిక్వెస్ట్ చేసింది. బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుండి వైదొలిగిన తర్వాత పాకిస్తాన్ మద్దతుగా నిలిచినందుకు గానూ బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్‌ కు సంఘీభావాన్ని తెలియజేస్తూ భారత్ తో మ్యాచ్ ఆడేది లేదని పాక్ తెలపడంపై ధన్యవాదాలు తెలిపారు.

పాకిస్తాన్ వైఖరిని అంగీకరిస్తూనే, క్రికెట్ పర్యావరణ వ్యవస్థ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, పాకిస్తాన్ ఆదివారం మ్యాచ్ ఆడటం మంచిదని అమీనుల్ కోరారు. కష్ట కాలంలో బంగ్లా బోర్డుకు పాక్ మద్దతు ఇవ్వడం మరువలేనిది అని.. మన సోదరభావం దీర్ఘకాలం వర్ధిల్లాలని లేఖలో పేర్కొన్నాడు. పాక్ లో పర్యటించిన అమీనుల్.. భారత్ తో మ్యాచ్ ఆడే విషయంలో వెనక్కు తగ్గవద్దని పాక్ బోర్డును డైరెక్ట్ గా కూడా కోరినట్లు సమాచారం. ఆ తర్వాతనే ఆయన అధికారికంగా కూడా లేఖ రాసారు.

Also Read : ఏ టైం అయినా.. డీఎస్పీ సిరాజ్ ఆన్ డ్యూటి..!

ఇక నిన్న.. పాక్ తన వైఖరిని మార్చుకుంది. భారత్ తో మ్యాచ్ ఆడేందుకు అంగీకారం తెలిపింది. ముందు.. భారత్ తో ఆడాలి అంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ కు పరిహారం చెల్లించాలి, ఐసీసీ తదుపరి టోర్నీలకు ఆతిధ్య హక్కులు ఇవ్వాలి.. భారత్ తో ద్వైపాక్షిక సీరీస్ లు ఆడాలి అంటూ డిమాండ్ చేసింది పాక్. కానీ ఐసీసీ వాటికి నో చెప్పింది. ఆడకపోతే ఉండే పరిణామాలను మాత్రమే హెచ్చరించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రాజ్యసభ సభ్యులుగా వాళ్లే...

ఏపీలో త్వరలో ఎన్నికల సందడి నెలకొననుంది....

మళ్లీ ఆ రోజే...

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల...

ఏకి పారేస్తున్న నేషనల్...

రాజకీయాలపై మీడియా ప్రభావం ఎక్కువ. ఛాన్స్...

ఆ మాట మాట్లాడవద్దు.....

ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలల...

రూ.750 కోట్లు డిపాజిట్...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో...

అంబటి మరో పోసాని...

రాజకీయాల్లో నోటి దూల సహజమే.. అది...

పోల్స్