Tuesday, October 28, 2025 01:36 AM
Tuesday, October 28, 2025 01:36 AM
roots

చింతమనేనిపై రాడ్లతో దాడి.. ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఏలూరులో వైసిపి మూకల హత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. పక్కా పథకం ప్రకారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో వాగ్వాదానికి దిగి.. ఐరెన్ రాడ్ తో చింతమనేని సహా ఆయన డ్రైవర్, గన్ మెన్ పై వైసిపి అల్లరి మూకలు దాడి చేశాయని టీడీపీ నేతలు చెప్తున్నారు.

Also Read : బడ్జెట్ పై చంద్రబాబు మల్లగుల్లాలు.. అసలేం చేద్దాం…?

చింతమనేని గన్ మ్యాన్ నుంచి గన్ లాక్కుని ఫైర్ చేసే ప్రయత్నం చేసినట్టు స్థానిక నేతలు చెప్తున్నారు. దీనితో సిబ్బంది వెంటనే అలెర్ట్ కావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు సమాచారం. దాడిలో స్వయంగా దెందులూరు వైసిపి ఇంచార్జీ కొటారు అబ్బయ్య చౌదరి సహా దాదాపు 25 మంది పాల్గోనట్టు వార్తలు వస్తున్నాయి. బుధవారం రాత్రి వట్లురు లో ఒక వివాహానికి హాజరై తిరిగి వస్తున్న చింతమనేని ప్రభాకర్ కార్ కు ఉద్దేశ్య పూర్వకంగా తమ కార్ ను అడ్డు పెట్టీ అబ్బయ్య చౌదరి, అతని అనుచరులు గొడవను సృష్టించినట్టు టీడీపీ నేతలు చెప్తున్నారు.

Also Read : తులసిబాబు విషయంలో రఘురామ సంచలన వ్యాఖ్యలు..!

ముందుగానే సిద్ధంగా ఉన్న వ్యక్తులతో వీడియోలు చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో పెట్టీ ప్రజలను తప్పు దోవ పెట్టించారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అలజడి సృష్టించాలని, తద్వారా రాష్ట్ర అభివృదిని అడ్డుకునేల వైసిపి కుట్రలు పన్నుతున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. మేము తలచుకుంటే ఏ ఒక్క వైసిపి నాయకుడు కూడా గ్రామాల్లో తిరగడు జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్