Friday, September 12, 2025 11:02 AM
Friday, September 12, 2025 11:02 AM
roots

ఈ నాయుడు మామూలోడు కాదుగా..!

ఏపీలో లిక్కర్ స్కామ్ విచారణలో రోజుకో అంశం వెలుగులోకి వస్తోంది. వైసీపీలో ముఖ్యనేతలంతా ఒక్కొక్కరిగా అరెస్టు అవుతూ వస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులుగా మెలిగిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని.. అసలు అవినీతే జరగలేదనేది వైసీపీ నేతల మాట. ఇక ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించిందని.. కాబట్టి ఇందులో స్కామ్‌కు ఆస్కారమే లేదంటారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. మరో అడుగు ముందుకేసిన సజ్జల.. ఏదైనా నేరం నిరూపించాలంటే ఏం చేస్తారు.. అవినీతి రుజువు చేయాలంటే ఏం చేస్తారు.. అని ఎదురు ప్రశ్నిస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో రెండు రోజులుగా వైసీపీ నేతల నోటికి తాళం పడిందనే చెప్పాలి.

Also Read : మెరిసిపోతున్న శోభిత ధూళిపాళ

మా నాన్న మందు వల్లే చనిపోయారు.. కాబట్టి.. నేను మద్యం ముట్టను.. ఆ వ్యాపారం చేయను.. చిన్నప్పుడే మా అమ్మకు మాట ఇచ్చాను.. అని కోర్టు ముందే చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. వేరే ఏ కేసులో అరెస్టు చేసినా పెద్దగా బాధపడేవాడిని కాదు.. కానీ మద్యం స్కామ్ అని నేను చేయని తప్పును నాకు అంటగట్టాలని చూస్తున్నారు. ఇది నన్ను ఎంతో బాధిస్తోంది.. అంటూ చెవిరెడ్డి చెప్పిన మాటలు.. అయ్యో పాపం.. నిజంగానే ఇలా తప్పుడు కేసులో అరెస్టు చేశారా.. అని సానుభూతి కలిగించాయి. కానీ సిట్ అధికారుల దర్యాప్తులో డబ్బుతో పాటు వీడియోలు, ఫోటోలు బయటకు రావడంతో.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినవన్నీ కల్లబొల్లి మాటలే అని అంతా విమర్శిస్తున్నారు. చెవిరెడ్డి మాటలకు వైసీపీ నేతలంతా కన్నీరు కూడా పెట్టుకున్నారు. కానీ హైదరాబాద్ ఫామ్ హౌస్‌లో రూ.11 కోట్లు దొరికిన తర్వాత ఒక్కసారిగా సైలెన్స్.

ఆ డబ్బు అరెంజ్ చేశారని ఒకరు.. ఆ డబ్బుకు వైసీపీ నేతలకు ఏ సంబంధం లేదని మరొకరు.. 12 పెట్టెల్లో 11 కోట్లు ఏమిటీ.. మరో కోటి ఏమైందని ఏకంగా మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేయడం చూసి.. ఆ పార్టీ కార్యకర్తలు నిజమే అనుకున్నారు. చివరికి డబ్బులు లెక్క పెడుతున్న వీడియో బయటకు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ కట్టలు ఎన్ని ఉన్నాయో తెలియదు.. కానీ లెక్క పెడుతున్న వ్యక్తిని చూసి మాత్రం.. షాక్ అయ్యారు. అతనే వెంకటేష్ నాయుడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసి. ఇంకా చెప్పాలంటే.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాల్య స్నేహితుడు. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్‌లో అందరికంటే కీలక భూమిక పోషించిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకటేష్ నాయుడు. డిలీట్ అయిన వీడియోలను సిట్ అధికారులు బయటకు తీయటంతో లిక్కర్ స్కామ్‌లో అసలు సూత్రదారులు ఎవరో బయటపడినట్లు అయ్యింది.

Also Read : మరో 10 రోజులే సమయం..!

నోట్ల కట్టల లెక్కింపు వీడియోతో షాక్ ఇచ్చిన వెంకటేష్ నాయుడు… ఆ తర్వాత ప్రత్యేక విమానంలో వెళ్తున్న వీడియో బయటకు రావడంతో వైసీపీ నేతలే ముక్కున వేలేసుకున్నారు. ఇక సెలబ్రేటీలతో ఫోటోలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో.. సోషల్ మీడియా మొత్తం వెంకటేష్ నాయుడు పేరు మారు మోగిపోతోంది. చెవిరెడ్డి బాల్య స్నేహితుడిగా పరిచయం అయిన ఈ నాయుడు.. జగన్‌తో కూడా చాలా క్లోజ్‌గానే ఉన్నారు. జగన్‌కు వెంకటేష్‌ నాయుడును స్వయంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిచయం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు జల్సాలు చేసిన వెంకటేష్.. ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరఫున డమ్మీగా కూడా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో చెవిరెడ్డి ఎన్నికల్లో పంచిన డబ్బు.. లిక్కర్ స్కామ్ పాపపు సొమ్మే కదా అని దుమ్మెత్తి పోస్తున్నారు.

Also Read : మీరు ఇండియన్ అయితే.. రాహుల్ కు సుప్రీం కోర్ట్ షాక్

వైసీపీ ఓడిన తర్వాత వెంకటేష్ వ్యవహార శైలి మారిపోయిందనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. వైసీపీకి దూరమైన వెంకటేష్.. సైలెంట్‌గా టీడీపీ, బీజేపీ నేతలకు దగ్గరయ్యారనేది ప్రధాన ఆరోపణ. వెంకటేష్ వీడియోలు బయటకు రావడంతో.. చంద్రబాబుతో వెంకటేష్ దిగిన ఫోటోలను వైసీపీ నేతలు రిలీజ్ చేశారు. టీడీపీ, బీజేపీ నేతలతో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటోలు ఇప్పుడు అందరినీ కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రాజకీయ రాయబారాలు నడిపిన వెంకటేష్ నాయుడు.. అటు తెలంగాణ నేతలతో పాటు సినీ ప్రముఖులతో కూడా చాలా సన్నిహితంగా ఉన్నారు. ప్రముఖ నటి తమన్నాతో ప్రత్యేక విమానంలో వెంకటేష్ ఉన్న ఫోటో, వీడియో హాట్ టాపిక్‌గా మారింది. ఇవన్నీ నాయుడు ఫోన్‌లోనే ఉన్నాయి. ఆ ఫోన్ పూర్తిగా డీ కోడ్ చేస్తే.. ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్