ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక అడుగులకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు మద్యం కుంభకోణం లో కిందిస్థాయి వ్యక్తులను టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు పక్క ఆధారాలతో బాంబు పేల్చడానికి దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2019 నుంచి 2024 వరకు పెద్ద ఎత్తున జరిగిన మద్యం కుంభకోణంలో.. పలు కీలక ఆధారాల ను సేకరించిన అధికారులు వాటి ఆధారంగా.. కీలక వ్యక్తులను అరెస్టు చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా సోషల్ మీడియాలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Also Read : కేటీఆర్ కు మైనస్.. లోకేష్ కు ప్లస్ అదే
మద్యం కుంభకోణంలో కీలకంగా భావిస్తున్న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఎక్కువగా దర్యాప్తు బృందం దృష్టి సారించినట్లు సమాచారం. ఆయన వద్ద పనిచేసిన అధికారులను అరెస్టు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగానే జగన్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జూన్ 10 లేదా 11వ తారీఖున జగన్ అరెస్ట్ ఉండే అవకాశం ఉందనే ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్దల అనుమతి కూడా లభించినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read : అవును.. ఆ ఇద్దరికి వాళ్లే సమస్య..!
లిక్కర్ కుంభకోణం నుంచి బయటపడటానికి జగన్ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా అది సాధ్యమయ్యే అవకాశం లేదనే అభిప్రాయానికి వైసీపీ అగ్ర నాయకత్వం కూడా వచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగటంతో జగన్.. అరెస్ట్ కావడం ఖాయం అనేది ప్రముఖంగా వినబడుతున్న మాట. అలాగే విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం కూడా జగన్ అరెస్ట్ కు కారణమయ్యే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయాలు సైతం వినపడుతున్నాయి. ప్రస్తుతం కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల చుట్టూనే దర్యాప్తు ఎక్కువగా తిరుగుతున్నట్లు సమాచారం. మనీలాండరింగ్ విషయంలో జాతీయ దర్యాప్తు బృందం కూడా ఎంటర్ కావడంతో త్వరలోనే మరిన్ని అరెస్టులు కూడా ఉండవచ్చు అనే సంకేతాలు వస్తున్నాయి.