Monday, March 30, 2026 02:30 PM
Monday, March 30, 2026 02:30 PM

ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్..!

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత, సిఎం చంద్రబాబును ఇరుకున పెట్టాలని భావించిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. ఈ కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన మూడు కీలక పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం, వాటిని కొట్టివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆళ్ల దాఖలు చేసిన ఈ పిటిషన్లకు కనీస విచారణార్హత లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ముఖ్యంగా, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు.

Also Read : వైసీపీకి బొలిశెట్టి మాస్ వార్నింగ్..!

కాబట్టి ఈ కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసుల నుండి సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆళ్ల ఒక పిటిషన్ వేశారు. అయితే, ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. దీనితో పాటు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు గతంలో మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన రెండో పిటిషన్‌ ను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. మరోవైపు, ఏసీబీ కోర్టులో ప్రస్తుతం జరుగుతున్న ఈ కేసు విచారణను ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి మూడవ పిటిషన్ ద్వారా కోరారు.

Also Read : చెల్లెలు కోసం అన్నకు షాక్ ఇస్తారా..? గులాబీ పార్టీలో వింత వాతావారణం..!

అయితే, ఈ మూడు పిటిషన్లు కూడా చట్టపరంగా నిలబడవని, వీటికి విచారణకు కావాల్సిన కనీస అర్హత లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. రాజకీయ ఉద్దేశాలతో వేసిన పిటిషన్లుగా భావిస్తూ న్యాయస్థానం వీటిని కొట్టివేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ తీర్పుతో సిఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించినట్లయింది. గత ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూసిందని, ఇప్పుడు న్యాయస్థానమే ఆ పిటిషన్లను కొట్టివేయడంతో నిజం గెలిచిందని టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాయుడుపై వేటు.. కొత్తగా...

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి...

ఒక్క కార్టూన్‌కే భయపడితే...

ఒక్క కార్టూన్‌కే భయపడితే ఎలా..? ఇప్పుడు...

ఒంటిమిట్ట కల్యాణం పౌర్ణమి...

కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి...

చెల్లెలు కోసం అన్నకు...

తెలంగాణ రాజకీయాల్లో గత ఏడాది కాలంగా...

శాసససభలో సరే.. మండలిలో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన...

ద్వారంపూడికి చెక్..? ఫోకస్...

ఏపీలో కూటమి ప్రభుత్వం.. నామినేటెడ్ పదవుల...

పోల్స్