Monday, March 2, 2026 08:03 PM
Monday, March 2, 2026 08:03 PM

మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 5 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఏపీ ప్రభుత్వం పరిపాలనలో వేగం పెంచి, ముఖ్యంగా ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐదువేల మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తిస్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్లు కల్పించి, పూర్తిస్థాయి వేతనాలు అందించనున్నట్లు వెల్లడించింది. అదనంగా, కొత్తగా ఐదువేల అంగన్వాడీ సహాయకుల నియామకానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Also Read : గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారికి మంత్రి కొండపల్లి భరోసా

అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సచివాలయంలో అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశమైన ఆమె, వారి సమస్యలపై సానుకూల దృక్పథంతో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో, అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అసెంబ్లీ వేదికగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి దాదాపు ఐదువేల అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడం ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం పేర్కొంది. నియామక ప్రక్రియకు సంబంధించిన సన్నాహాలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Also Read : యుద్ధం మొదలైంది.. ఇరాన్ రియాక్షన్ స్టార్ట్..!

రాష్ట్రంలో ప్రస్తుతం 257 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 55,746 అంగన్వాడీ కేంద్రాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా గర్భిణులు, బాలింతలు, ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టికాహారం మరియు ప్రాథమిక సంరక్షణ సేవలు అందుతున్నాయి. గతంతో పోలిస్తే అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడగా, పౌష్టికాహార సరఫరా కూడా విస్తరించింది.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సేకరించి, ఐదువేలకుపైగా అంగన్వాడీ సహాయక పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పౌష్టికాహార పంపిణీ కేంద్రాలుగానే కాకుండా, పూర్వ ప్రాథమిక విద్య అందించే సమగ్ర సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ నియామకాలు చేపట్టనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏఐ డీప్‌ఫేక్ కలకలం...

సాంకేతికతను ఆసరాగా చేసుకుని మహిళల గౌరవానికి...

మహిళా దినోత్సవ కానుకగా...

ఏపీలో మహిళల సాధికారతకు కూటమి ప్రభుత్వం...

ప్లీజ్.. అతన్ని రీప్లేస్...

ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా...

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న...

- ఏపీ ఎన్నార్టీ కో ఆర్డినేటర్ల...

సోషల్ మీడియా లీక్...

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఓ...

టార్గెట్ బీఆర్ నాయుడు.....

తిరుమల విషయంలో మరో వివాదం ఇప్పుడు...

పోల్స్