ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామి రెడ్డి అడ్డంగా బుక్కయ్యాడు. గత అయిదేళ్లుగా స్వామి భక్తితో చెలరేగిపోయిన వెంకటరామి రెడ్డిని ఎక్సైజ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అర్థరాత్రి అరెస్టు చేసిన ఎక్సైజ్ అధికారులు… స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర సచివాలయ క్యాంటీన్ ఎన్నికల్లో ఉద్యోగులను ప్రలోభపెట్టేందుకు మందు, విందు పార్టీలు ఇచ్చాడు. ఉద్యోగులను ప్రలోభపెట్టేందుకు పార్టీ ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.
Also Read : రిమాండ్ రిపోర్ట్ తో విజయ్ పాల్ కి ఉచ్చు బిగించిన పోలీసులు
సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డిని నిన్న అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్స్ లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేసాడు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం… ఇటువంటి మందు పార్టీలు ఏర్పాటుకు ముందుగా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తప్పనిసరి అని అధికారులు చెప్తున్నారు. ఎటువంటి అనుమతులేవీ లేకుండానే విందు జరుగుతోందన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులకు గురువారం రాత్రి 11 గంటలకు దాడి చేసారు. దీంతో స్థానిక పోలీసులతో కలిసి ఆ గార్డెన్స్ లో సోదాలు నిర్వహించారు.
అక్కడ ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం ఉండడంతో అది నిబంధనలకు విరుద్ధమని తెలిపిన ఎక్సైజ్ అధికారులు… పలువురు ఉద్యోగులను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. తమకీ విషయం తెలియదని.. వెంకట్రామిరెడ్డి ఆహ్వానిస్తే వచ్చామని కొందరు ఉద్యోగులు సమాచారం ఇచ్చారు. దీనితో పోలీసులు వెంకట్రామి రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ సూర్యనారాయణ, గుంటూరు ఎక్సైజ్ ఏఈఎస్ మరియబాబు పాల్గొన్నారు. సచివాలయం క్యాంటీన్ ఎన్నికలు నేపథ్యంలో మందు, విందు పార్టీ ఏర్పాటు చేసారు.
Also Read : టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మాజీ ఎంపీ..?
మొత్తం 10 డైరెక్టర్ పదవుల కోసం 28 మంది పోటీలో ఉండగా వెంకట్రామిరెడ్డి వర్గం నుంచి 11 మంది పోటీలో ఉన్నారు. ఉద్యోగ నేత కంటే వైసీపీ కార్యకర్తగానే ఎక్కువగా వ్యవహరించిన వెంకట్రామిరెడ్డి… సాధారణ ఎన్నికలకు ముందు కోడ్ అమలులో ఉన్న సమయంలో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసినందుకు సస్పెండ్ చేసింది ఎన్నికల సంఘం. ఇలా ఇప్పుడు ఆధారాలతో దొరికిపోయిన వెంకట్రామి రెడ్డి ని చట్ట ప్రకారం అందరి నిందితులతో వ్యవహరించినట్లు వ్యవహరిస్తారా లేక ఇప్పటికే గనుల వెంకట్ రెడ్డి కి చేస్తున్నట్లు మర్యాదలు చేస్తారా అనేది చూడాలి.