Sunday, June 21, 2026 07:44 AM
Sunday, June 21, 2026 07:44 AM

పాకిస్తాన్ తో అమెరికా అక్రమ స్నేహం.. మరో సంచలన పరిణామం

పాకిస్తాన్ తో అమెరికా స్నేహ బంధం విషయంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్ కు అన్ని విధాలుగా సహకరించే అమెరికా.. భారత్ విషయంలో మాత్రం డ్రామాలు ఆడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ విషయంలో కూడా అమెరికా జోక్యం చేసుకుని కాల్పుల విరమణకు భారత్ పై ఒత్తిడి చేసిన సంగతి తెలిసిందే. అటు పాకిస్తాన్ మిత్ర దేశం చైనాతో కూడా రహస్యంగా స్నేహం చేస్తూ వస్తోంది అమెరికా. చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసారు.

Also Read : తెలంగాణలో బాబు, పవన్ ఎంట్రీ.. లైన్ క్లియర్

ఇక తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 250వ అమెరికా ఆర్మీ వార్షికోత్సవానికి పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ను అమెరికా సర్కార్ వాషింగ్టన్‌కు ఆహ్వానించింది. సైనిక కవాతులో పాల్గొననున్న మునీర్, అమెరికా విదేశాంగ శాఖ, పెంటగాన్ అధికారులను కలవనున్నారు. మునీర్ పర్యటన సందర్భంగా వాషింగ్టన్‌లో నిరసనలకు పాక్ వ్యతిరేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. వాషింగ్టన్ డీసీలో జరిగే అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి అసిమ్ మునీర్ ఈ వారం అమెరికాకు వెళ్లనున్నట్లు ఆ దేశ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Also Read : అమరావతి రైతులపై దాడి చేయమన్నాడు.. బాంబు పేల్చిన కోటంరెడ్డి

ఇక ఇదే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ పుట్టినరోజు కూడా ఉంది. భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఈ పర్యటన ఆసక్తిని రేపుతోంది. మునీర్‌ను అమెరికాకు చెందిన ఒక ఉన్నత జనరల్ ప్రశంసించిన కొన్ని రోజుల తర్వాత ఈ పర్యటన ఖరారు కావడం గమనార్హం. దీనిపై భారత్ లోని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ దీనిపై స్పందిస్తూ ఇది దౌత్యపరమైన ఎదురు దెబ్బగా అభివర్ణించింది. మునీర్ వాషింగ్టన్ రాకపై పాకిస్తాన్ ప్రవాసుల నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభుత్వంతో ఏ ఒప్పందం కూడా పాకిస్తాన్ ప్రజలకు ఆమోదయోగ్యం కాదని వైట్ హౌస్ కు తెలియజేయండి అంటూ పాకిస్తాన్ ప్రవాసులు మండిపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్