Saturday, March 28, 2026 04:04 AM
Saturday, March 28, 2026 04:04 AM

ప్రైవేట్ సైన్యం.. ఏ హీరో చేయని సాహసం..!

టాలీవుడ్ లో ఇప్పుడు ఫ్యాన్ వార్ ఇప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది. వందల కోట్ల కలెక్షన్స్, మార్కెటింగ్, సోషల్ మీడియా ఎలివేషన్ లు ఇలా ఇప్పుడు సినిమాను డామినేట్ చేస్తున్న మాట వాస్తవం. అందుకే కొందరు హీరోలు ఏ పరిస్థితిలో అయినా నిలబడేలా.. బ్యాడ్ టైం ఎలా ఉన్నా బయట పడటానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో అల్లు అర్జున్ ముందు ఉంటాడు. తన సినిమాలకు ఎంత నెగటివ్ ప్రచారం చేసినా సరే.. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఫ్యూచర్ ప్లానింగ్ పక్కాగా ఉండేలా స్కెచ్ గీస్తున్నాడు.

Also Read : స్పిరిట్ పుకార్లకు ప్రకాష్ రాజ్ చెక్..!

మెగా కాంపౌండ్ లో ఉన్నాడు కాబట్టి పెద్దగా ప్రాబ్లం రాలేదు. మెగా ఫ్యాన్స్ నెత్తిన మోశారు.. కానీ పుష్ప తర్వాత సీన్ తేడాగా కనపడింది. అందుకే ఇప్పుడు తన సైన్యాన్ని తాను సిద్దం చేస్తున్నాడు. ఎప్పుడూ లేని విధంగా అభిమాన సంఘాలకు పదవులను తానే ప్రకటిస్తున్నాడు. ఇక అభిమాన సంఘాలను ప్రాంతాల వారీగా కలిసే ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ లో అల్లు అర్జున్ అభిమాన సంఘం మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో ఎన్నో విషయాలను అభిమాన సంఘం నాయకులు చర్చించారు.

Also Read : అంబటి మరో పోసాని అవుతారా..?

ఓ రాజకీయ పార్టీ నిర్మాణం మాదిరిగా ఇది ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. అభిమానులకు రిజిస్ట్రేషన్ సిస్టం తీసుకు రావడమే కాదు, వారికి ఇన్సూరెన్స్ లు, ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో మీటింగ్ లు ఇలా ప్రతీ ఒక్కటీ ఓ ప్లాన్ ప్రకారమే వెళ్తున్నాడు. ఫ్యాన్స్ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదుకునేందుకు కూడా ఓ వ్యవస్థను తీసుకురావాలని బన్నీ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా తన కోసం ఓ వ్యవస్థ నడిచే విధంగా ఐకాన్ స్టార్ స్కెచ్ రెడీ చేసినట్టు టాక్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ లిక్కర్ కేసు.....

ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ...

తిరుమలను తాకిన గ్యాస్...

పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్...

డిప్యూటీ స్పీకర్ రఘురామపై...

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఉద్రిక్తత...

బ్రేకింగ్: బయటపడ్డ అగ్ని...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గత కొద్దిరోజులుగా...

నిజామాబాద్ వేదికగా కవిత...

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం...

సీట్ల పెంపు.. ఎవరికి...

లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలన్న...

పోల్స్