Friday, September 12, 2025 07:09 PM
Friday, September 12, 2025 07:09 PM
roots

భారత్ కు షాక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్..?

పాకిస్తాన్ – చైనా దేశాల మధ్య స్నేహం రోజు రోజుకు తీవ్రమవుతోంది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌ను ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించేందుకు చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బుధవారం అంగీకారం తెలిపాయి. మూడు దేశాల అగ్ర నాయకులు త్రైపాక్షిక సహకారాన్ని మరింతగా విస్తరించుకునేందుకు అంగీకారం తెలిపారు. పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి/విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి బీజింగ్‌లో అనధికారిక త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.

Also Read : జనసేన కూడా గేట్లు మూసివేసిందా..? కారణం ఇదేనా..?

ఈ సమావేశంలో చర్చించిన అనంతరం.. చైనా-పాకిస్తాన్ ఆర్థిక ఎకనామిక్ కారిడార్ పై పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన చేసింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత జరిగిన మొదటి సమావేశం ఇదే. పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ స్థానికంగా శాంతి, స్థిరత్వం, అభివృద్ధి కోసం కలిసి నిలుస్తాయని.. పాకిస్తాన్ విదేశాంగ శాఖా మంత్రి పోస్ట్ చేసారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ద్వారా నుంచి వెళ్తున్న ఈ ఎకనామిక్ కారిడార్ ను 60 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేస్తున్నారు.

Also Read : ఐఎస్ఐ ఎలా పని చేస్తుంది..? పాక్ గూడచారి సంస్థ సంచలన విషయాలు

ఈ నిర్మాణాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. 6వ త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశం కాబూల్ లో జరగనుందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. వాణిజ్యం, మౌలిక సదుపాయాల కల్పన దిశగా అడుగులు పడుతున్నాయని ఆఫ్ఘన్ ప్రకటన చేసింది. కాగా భారత్ తో ఆఫ్ఘనిస్తాన్ సన్నిహితంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ లో క్రికెట్ ను ప్రోత్సహించేందుకు భారత్ నిధులు కూడా కేటాయిస్తూ వస్తోంది. తాలిబాన్ ప్రభుత్వం కారణంగా దూకుడుగా వెళ్లకపోయినా పలు కార్యక్రమాలకు మాత్రం భారత్ సాయం చేస్తూ వస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్