Friday, September 12, 2025 05:01 PM
Friday, September 12, 2025 05:01 PM
roots

పొన్నవోలును మార్చినా పని జరగలేదా..? అందుకే మరో రెడ్డి గారికి..!

గత ఏడాది కాలంలో.. వైసీపీ హయాంలో రెచ్చిపోయిన ఒక్కొక్కరిని పోలీసులు అరెస్ట్ లు చేస్తూ వస్తున్న విషయం అందరికి క్లారిటీ ఉంది. అక్రమాలకు పాల్పడిన వారి విషయంలో సర్కార్ కఠిన వైఖరి ప్రదర్శించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక తమ నేతలను కాపాడుకోవడానికి వైసీపీ అధిష్టానం.. తమ న్యాయ విభాగంలో కీలకంగా ఉన్న.. మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని లాయర్ గా నియమిస్తూ వస్తోంది. ఆయన వాదించిన ప్రతీ కేసులో కూడా ప్రతీ ఒక్కరికి రిమాండ్ విధించారు.

Also read : మరో మాజీ మంత్రికి లిక్కర్ దెబ్బ

పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వల్లభనేని వంశీ మోహన్, సోషల్ మీడియా కార్యకర్తలు, నందిగం సురేశ్, పోసాని కృష్ణ మురళీ.. ఇలా దాదాపుగా అందరికి రిమాండ్ పడింది. ఆయన ఏ చట్టం చదివినా రిమాండ్ పడింది. సాక్ష్యాలు బలంగా ఉండటంతో న్యాయమూర్తులు రిమాండ్ లు విధిస్తూ వచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా భారీగానే జరిగింది. వైసీపీ కార్యకర్తలు కూడా ఆయనపై సెటైర్ లు వేయడం చూసాం. ఇప్పుడు లిక్కర్ స్కాం కేసు వచ్చింది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసారు.

Also read : చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలకు భయమా..?

ఆయనను అరెస్ట్ చేయక ముందు.. అందరూ భావించింది, మిథున్ రెడ్డి తరుపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తారు అని.. కానీ అనూహ్యంగా నాగార్జున రెడ్డి అనే లాయర్ ను తెర మీదకు తీసుకొచ్చారు. సుధాకర్ రెడ్డి పలు మార్లు విఫలం అయినా సరే ఇతర నాయకుల విషయంలో ఆయననే కొనసాగించిన ఆ పార్టీ అధిష్టానం.. మిథున్ రెడ్డి విషయంలో మాత్రం జాగ్రత్త పడింది. అరెస్ట్ అయితే తమకు ఇబ్బందే అని భావించి.. నాగార్జున రెడ్డిని నియమించింది. కాని ఆయన కూడా బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేయలేకపోయారు. అటు సుప్రీం కోర్ట్ లో వ్యక్తిగతంగా మిథున్ రెడ్డి పర్సనల్ లాయర్ ను నియమించుకున్నా సరే పని జరగలేదు. ఇక మిథున్ రెడ్డికి లేటెస్ట్ గా రిమాండ్ విధించింది కోర్ట్. ఇక్కడ కూడా నాగార్జున రెడ్డి వాదించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

పోల్స్